జిల్లాలో ప్రారంభమైన ధాన్యం సేకరణ..


Ens Balu
3
Vizianagaram
2020-12-15 22:18:20

విజయనగరం  జిల్లాలో  256 ధాన్యం సేకరణ కేంద్రాలలో మంగళ వారం నుండి  సేకరణ  మొదలైందని, ఈ కార్యక్రమాన్ని గ్రామాల్లో పండగలా  జరపాలని సంయుక్త కలెక్టర్ డా. జి.సి. కిషోర్ కుమార్ తెలిపారు.   మంగళవారం డెంకాడ సచివాలయాన్ని, ధాన్యం సేకరణ కేంద్రాన్ని  ఆయన తనిఖీ చేసారు.   ఈ సందర్భంగా జే.సి  మట్లాడుతూ    జిల్లాలో 5 లక్షల మెట్రిక్  టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించడం జరిగిందని, లక్ష్యాలను సాధించడం లో  మండల స్థాయి అధికారులు, సిబ్బంది సమన్వయం తో పని చేయాలనీ అన్నారు.  ప్రతి కేంద్రం ఆన్లైన్లో  ఉండాలని, అదే విధంగా ఫిసజికల్ గా కూడా ఓపెన్ చేసి ఉంచాలని  అన్నారు.   తాసిల్దార్లు నిత్యం పర్యవేక్షించాలని, ప్రతి రోజూ సేకరణ పై నిర్దేశిత  ప్రోఫార్మ  లో  నివేదకలు ఇవ్వాలని సూచించారు.  ప్రతి రోజూ ఎంత మంది రైతులు ఈ క్రాప్ లో  నమోదు అవుతున్నారు ,   ఎంత మందికి సేకరణ కూపన్ లు ఇచ్చారు,  ఎన్ని ఎకరాల్లో పంట దెబ్బ తిన్నది,  రంగు మారిన ధాన్యం వివరాలు సమర్పించాలన్నారు.  గన్నీ సంచులు సరిపడా అందినది లేనిది తెలిఅజేయలన్నారు.  బ్యాంకుల నుండి గ్యారంటీ లు ఎన్ని మిల్లులకు అందినది,  ఇంకను అందవలసినవి ఎన్ని , ట్యాగ్ అయిన మిల్లుల వివరాలను  అందజేయలన్నారు.    ప్రతి రోజు  ఎంత మొత్తం లో సేకరణ జరిగింది ఏ రోజుకారోజు  సమాచారాన్ని అందజేయలన్నారు.    జిల్లాలో 2 లక్షల మంది రైతులు ఈ క్రాప్ లో నమోదు కావలసి ఉండగా ఇంతవరకు 53 వేల మందిని మాత్రమే నమోదు చేసారని, ఇంకను 1.5 లక్షల మందిని నమోదు చేసుకోవలసి ఉందని, ఈ నమోదు పై మండల వ్యవసాయ అధికారులు ప్రత్యేక  దృష్టి పెట్టాలని  సూచించారు.