అప్పీళ్లను పరిశీలించిన ఆర్టీఐ కమిషనర్..
Ens Balu
6
Vizianagaram
2020-12-15 22:20:26
సమాచార హక్కు చట్టం క్రింద ఆర్‌టిఐ కమిషన్‌కు దాఖలైన అప్పీళ్లను ఆర్‌టిఐ రాష్ట్ర కమిషనర్ ఆర్.శ్రీనివాసరావు విచారించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రెండురోజులపాటు ఈ విచారణ జరిగింది. సోమవారం 18 శాఖలకు చెందిన అధికారులతో సమావేశాన్ని నిర్వహించి, అప్పీళ్లను విచారించి, తగు ఉత్తర్వులను జారీ చేశారు. రెండోరోజు మంగళవారం 22 శాఖలకు చెందిన అప్పీళ్లను విచారించి, ఆదేశాలను జారీ చేశారు. కొన్ని శాఖలనుంచి దరఖాస్తు దారులకు ఇచ్చిన సామాచారం పట్ల సంతృప్తిని వ్యక్తం చేసి, అటువంటి కేసులను కొట్టివేశారు. వివిధ ప్రభుత్వ శాఖల్లోని సమాచార అధికారులు (పిఐఓలు), మొదటి అప్పీల్ అధికారులు, జిల్లా అధికారులతో, ఆర్టీఐ అమలుపై బుధవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటలకు ఈ సమావేశం కలెక్టరేట్ ఆడిటోరియంలో జరుగుతుంది.