పరిశుభ్రతతోనే ఆరోగ్య పరిరక్షణ..
Ens Balu
2
Vizianagaram
2020-12-15 22:22:00
పరిశుభ్రత, పచ్చదనం, ఆరోగ్యమే లక్ష్యంగా ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్ పిలుపునిచ్చారు. స్వచ్ఛాంధ్ర మిషన్ జిల్లాకు అందజేసిన స్వచ్ఛ ప్రచార రథాన్ని మంగళవారం కలెక్టర్ ప్రారంభించారు. ప్లాస్టిక్ వాడకాన్ని నిషేదించడం, పారిశుధ్యం, మరుగుదొడ్ల వినియోగం, కరోనా వ్యాప్తి నివారణా చర్యలు తదితర అంశాలపై ప్రచార రథం ద్వారా ప్రజలని చైతన్య పరచాలని కలెక్టర్ కోరారు. పచ్చదనం ప్రాధాన్యతపై జిల్లా కలెక్టర్ స్వయంగా పాడిన పాటను వినిపించారు. ప్రదర్శనను ఏర్పాటు చేశారు. మండలానికి రెండు రోజుల చొప్పున వచ్చేనెల 13 వరకూ ఈ ప్రదర్శన జరగనుంది. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ (అభివృద్ది) డాక్టర్ ఆర్.మహేష్ కుమార్, పశుసంవర్థకశాఖ జెడి ఎంవిఏ నర్సింహులు, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్ఇ పప్పు రవి, డిఇలు కవిత, సునీత, హెచ్ఆర్‌డి కన్సల్టెంట్ టి.సుధాకర్, పలువురు ఏఇలు, సిబ్బంది పాల్గొన్నారు.