వయోజన విద్య కార్యాలయం తరలింపు..
Ens Balu
2
Srikakulam
2020-12-16 21:06:23
శ్రీకాకుళం పట్టణంలోని వయోజన విద్య ఉప సంచాలకుల వారి కార్యాలయం రిమ్స్ ఆసుపత్రి రోడ్ నుండి అఫీషియల్ కాలనీలో గల ఎ5 భవనంకు తరలించబడిందని ఆ శాఖ ఉప సంచాలకులు ముద్దాడ వెంకటరమణ పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేసారు. జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు తమ కార్యాలయాన్ని ఈ నెల 15న అఫీషియల్ కాలనీలో ఎ5 భవనం ( గతంలో శరణ్య మనోవితాస కేంద్రం భవనం), పోస్ట్ ఆఫీస్ ప్రక్కనకు తరలించడం జరిగిందని పేర్కొన్నారు. కావున జిల్లా అధికారులు, ప్రజలు ఈ మార్పును గమనించాలని ఆయన కోరారు. ఇకపై కార్యాలయపు ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ కొత్త కార్యాలయం నుండి జరుపబడుతుందని ఆయన ఆ ప్రకటనలో వివరించారు.