మోటార్ రేస్ ట్రాక్ స్థలం పరిశీలన..


Ens Balu
3
Tanakallu
2020-12-16 22:42:41

అనంతపురం జిల్లా తనకల్లు మండలం కోటపల్లి వద్ద ఏర్పాటు చేయనున్న ఎఫ్ -1ఏ  గ్రేడ్ -3 మోటార్ రేస్ ట్రాక్ స్థలాన్ని  జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పరిశీలించారు. బుధవారం కదిరి ఆర్డీఓ వెంకట శివారెడ్డి,టూరిజం రీజినల్ డైరెక్టర్ ఈశ్వరయ్య లతో కలిసి 150 కోట్ల రూపాయలతో తనకల్లు మండలం కోటపల్లి వద్ద 219 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ఎఫ్ -1ఏ  గ్రేడ్ -3 మోటార్ రేస్ ట్రాక్ స్థలాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు.ఈ సందర్భంగా నిధి మార్క్1డైరెక్టర్ అనుష్ చక్రవర్తి అక్కడ ఏర్పాటు చేస్తున్న రేస్ ట్రాక్, గోల్ఫ్ కోర్స్,హాస్పిటల్ తదితర వివరాలను,ప్రస్తుతం చేపట్టిన పనులను జిల్లా కలెక్టర్ కు వివరించారు. అనంతరం రేస్ ట్రాక్ కోసం భూములు ఇచ్చిన రైతులలో పరిహారం అందని  కొందరు రైతులు తమకు పరిహారం అందని విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ అంశాన్ని పరిశీలించమని ఆర్డీఓను కలెక్టర్ ఆదేశించారు. రైతుల పేరుపై పట్టాలు ఉంటేనే నష్టపరిహారం అందించేందుకు వీలవుతుందన్నారు అంతేకాకుండా ఆ భూమిలో ఆ రైతులు అనుభవంలో ఉంటేనే ఇవ్వడం జరుగుతుందని వారికి జిల్లా కలెక్టర్ తెలిపారు.అనంతరం ఇళ్ల పట్టాలు కావాలని అక్కడికి విచ్చేసిన కోటపల్లి గ్రామస్తులు అర్జీలు జిల్లా కలెక్టర్ కు సమర్పించగా, స్థానిక తాసిల్దార్ ను వెంటనే అర్జీలను పరిశీలించి ఇళ్ల పట్టాలు ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి,లేని వారికి ఇళ్ల పట్టాలుమంజూరు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక తాసిల్దార్ సుబ్బలక్ష్మమ్మ, జిల్లా టూరిజం అధికారి దీపక్, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.