ఇసుక కొరత లేకుండా చూడాలి..
Ens Balu
2
Visakhapatnam
2020-12-16 23:09:01
రాష్ట్రంలో ఏ ఒక్కరికీ ఇసుక కొరత ఉండరాదని మైన్స్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది వెల్లడించారు. బుధవారం ఇసుక పై జిల్లా కలెక్టర్లుతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న పాలసీనే కొనసాగించాలన్నారు. ప్రజలకు అవసరమైన ఇసుకను స్టాక్ పాయింట్లు వద్ద నిలువ ఉంచుకోవాలని చెప్పారు. ఇసుక కావలసిన వారికి డోర్ వెలివరీ చేయాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం ముఖ్య కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్యరాజ్ మాట్లాడుతూ కొత్త రీజ్ లు అవసరమైతే ప్రతిపాదనలు పంపాలన్నారు. రాబోయే రోజుల్లో గృహాలు నిర్మాణాలకు ఇసుక అవసరమౌతుందని, సిద్దంగా ఉంచుకోవాలన్నారు. ఏ సమస్యలు లేకుండా ఇసుక సరఫరా చేయాలని సూచించారు. జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ మాట్లాడుతూ ఇసుక సరఫరాకు జిల్లాలో ఏ విధమైన సమస్య లేదన్నారు. బుకింగ్ లో ఏ విధమైన సమస్యలు లేవని తెలిపారు. ఇసుక కావలసిన వారికి డోర్ డెలివరి చేస్తున్నట్లు పేర్కొన్నారు. అవసరమైన ఇసుకను శ్రీకాకుళం, తూర్పు గోదావరి జిల్లాల నుండి తీసుకువస్తున్నట్లు ఆయన వివరించారు. జిల్లాలో ఏ విధమైన సమస్యలు లేవని చెప్పారు. ఈ సమావేశంనకు జిల్లా జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, మైన్స్ శాఖ ఉప సంచాలకులు సత్తిబాబు, విశాఖపట్నం, అనకాపల్లి సహాయ సంచాలకులు డివిఎస్ఎన్ రాజు, ప్రకాష్ కుమార్ పాల్గొన్నారు.