పథకం అమల్లో "తోడు"గా ఉండండి..


Ens Balu
2
2020-12-16 23:16:12

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మంగా చేపడుతున్న జగనన్న తోడు పథకం అమలులో బ్యాంకు అధికారులు సహాయ సహకారాలు అందజేయాలని సంయుక్త కలెక్టర్ (ఆసరా) జె.వెంకటరావు కోరారు. జగనన్న తోడు పథకంలో భాగంగా వివిధ బ్యాంకులకు ఆర్థిక సహాయం నిమిత్తం పలువురు పెట్టుకున్న దరఖాస్తుల స్థితిని, అమలు ప్రక్రియను పరిశీలించేందుకు ఏపీజివిబి, ఐ.ఓ.బి. బ్యాంకుల ప్రాంతీయ కార్యాలయాలను బుధవారం ఆయన సందర్శించారు. లబ్ధిదారులు పెట్టుకున్న పెండింగ్ దరఖాస్తులను పరిష్కరింపజేశారు. లబ్ధిదారుల సమస్యల పరిష్కారానికి తీసుకున్న చర్యలపై సమీక్షించారు. జగనన్న తోడు పథకంలో ప్రభుత్వ అధికారులకు, సిబ్బందికి సహకరించాలని కోరారు. త్వరితగతిన మిగిలిన దరఖాస్తులను పరిష్కరించి ప్రజలకు పథక ఫలాలు అందేలా చూడాలని చెప్పారు. ప్రభుత్వ అధికారుల నుంచి, సిబ్బంది నుంచి ఎలాంటి సహాయం అయినా అందిస్తామని ఈ సందర్భంగా జేసీ అన్నారు. కార్యక్రమంలో ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ ఎస్.ఎస్.వర్మ, మెప్మా పి.డి. సుగుణాఖర్ రావు, ఎంపిడివోలు, ఏసీలు, ఏపీ ఎంలు, సి.సి.లు, తదితరులు ఉన్నారు.