బాధితులను అన్నివిధాలా ఆదుకుంటాం..ఐటిడిఎపీఓ


Ens Balu
2
2020-08-07 16:56:27

పాడేరు ఐటీడిఎ పరిధిలోని ఈనెల 2 వతేదీన పెదబయలు మండ లం జి.చింతలవీధి పరిధిలో జరిగిన బ్లాస్టింగ్ లో మృతిచెందిన బాధిత కుటుంబాలను అన్నివిధాలా ఆదుకుంటామని సమీకృత గిరిజనాభివృద్ధి సంస్ధ ప్రాజెక్ట్ అధికారి డా.వెంకటేశ్వర్ సలిజామల స్పష్టం చేసారు. ప్రభుత్వం ఆదేశాలు మేరకు బాధితులను శుక్రవారం ఉదయం ఐటీడీఏ కు పిలిపించి చెక్కులను అంద జేశారు. మృతుడు మెండిపల్లి మోహనరావు (29)భార్య అప్పలమ్మ కు రూ.లక్ష,మరొక మృతుడు మెండిపల్లి అజయ్ కుమార్(17) ,తల్లిదండ్రులు బూదన్న, జానకమ్మలకు రూ.లక్ష చెక్కును అందజేశారు. ల్యాండ్ మైన్ జరిగిన నేపద్యాన్ని అడిగి తెలుసుకున్నారు.అధైర్య పడకండి ఆదుకుంటామని భరోసాను ఇచ్చారు. ప్రభుత్వ పథకాలను మంజూరు చేస్తామని చెప్పారు. గ్రామానికి రహదారి నిర్మించాలని బాధితులు వినతిపత్రం సమర్పించారు. రహదారి నిర్మాణానికి పి.వో సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రాజకమల్, ఐటీడీఏ పరిపాలనాధికారి కె.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.