ప్రెసీ విశాఖ చైర్మన్ గా పిఎల్కె మూర్తి..


Ens Balu
3
Visakhapatnam
2020-12-17 20:30:04

జాతీయ ప్రజా సంబంధాల నిపుణుల సంస్ధ (పబ్లిక్‌ రిలేషన్స్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా) విశాఖ విభాగం 2020-2022 నూతన  చైర్మన్ గా పి.ఎల్‌.కె.మూర్తి ఎన్నికయ్యారు. ఈ మేరకు విశాఖలో గురువారంలో కమిటీని ఎన్నికల విభాగం ప్రకటించింది. ఇందులో వైస్‌ చైర్మన్‌గా, స్టీల్  ప్లాంట్  కార్పోరేట్  కమ్యూనికేషన్స్  జనరల్ మేనేజర్ ఆర్‌.పి.శర్మ, కార్యదర్శిగా  హెచ్ పి సి ఎల్ మేనేజర్ (పబ్లిక్ రిలేషన్‌)ఎం.కె.వి.ఎల్‌. నరసింహం, సంయుక్త కార్యదర్శిగా విశాఖ డైరీ  ప్రజా సంబంధాల అధికారి ఎ.గోవిందరావు,  కోశాధికారిగా  గీతమ్ డీమ్డ్ విశ్వవిద్యాలయం ప్రజా సంబంధాల అధికారి ఎన్‌.వెంకట నరసింహం ఎన్నికయ్యారు. ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యులుగా ఎన్టీపిసి, మేనేజర్, పబ్లిక్ రిలేషన్సు టి.మల్లయ్య,  ఇకో రైల్వే సీనియర్ పి ర్ ఇన్స్పెక్టర్ బి.జయరామ్‌ ఎన్నిక అయయారని ఎన్నికల అధికారి కె.రామారావు తెలిపారు. నూతన కార్య వర్గాన్ని పిఆర్ఎస్ఐ దక్షణ భారత  ఉపాధ్యక్షుడు యు.ఎస్. శర్మ, చాప్టర్ సలహదారు ప్రొఫెసర్ డివిఆర్ మూర్తి ఓ కార్యక్రమంలో అభినందించారు.