ఘనంగా వైఎస్ షర్మిల జన్మదిన వేడుకలు..


Ens Balu
3
Visakhapatnam
2020-12-17 20:35:41

షర్మిల ఎంతో ధైర్యవంతురాలని,డైనమిక్ నాయకురాలని విశాఖ దక్షిణ శాసనసభ్యుడు వాసుపల్లి గణేష్ కుమార్ కొనియాడారు. గురువారం ఆంధ్రుల అభిమాన నాయకుడు వై ఎస్ రాజశేఖర రెడ్డి గారాల తనయ,ఆంధ్రరాష్ట్రముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ముద్దుల చెల్లెలు షర్మిల పుట్టినరోజు వేడుకలను విశాఖ దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యుని కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ అన్న తో పాటు ఎన్నో కష్ట నష్టాలను భరించి ఓపిగ్గా,ఉత్సాహంగా పాదయాత్రలో పాల్గొని పార్టీ అధికారంలోకి రావడానికి కారణమయ్యారని కొనియాడారు.భవిష్యత్తులో ప్రజాసేవలో మరిన్ని బాధ్యతాయుతమైన పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు.అనంతరం  నియోజకవర్గ మహిళానాయకుల,అభిమానుల,కార్యకర్తల ఆనందోత్సహాల మధ్య   వాసుపల్లి కేక్ కట్ చేసి పంచిపెట్టారు.పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా సిటీ మహిళా ప్రెసిడెంట్ గరికిన గౌరి, సౌత్ మహిళా ప్రెసిడెంట్ నీలాపులక్ష్మీ,మరియు 14మంది వార్డ్ మహిళా అధ్యక్షురాళ్లకు శాలువాలతో సన్మానించి చీరలు అందచేశారు.ఈ వేడుకల్లో పాల్గొన్న మహిళలు,కార్యకర్తలు,అభిమానులు షర్మిల కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు.