అమరావతి రాజధానిని విచ్ఛిన్నం చేస్తున్నారు..


Ens Balu
2
Visakhapatnam
2020-12-17 21:20:05

ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత నవ్యంధ్రా రాజధానిగా అమరావతిని నిర్మించుకునే అవకాశాన్ని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెడగొతున్నారని తెలుగుదేశం విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడు,మాజీ శాసనసభ్యుడు పల్లా శ్రీనివాసరావు విమర్శించారు. అమరావతి రైతుల ఉద్యమానికి 365 రోజులు పూర్తి అయిన సందర్భంగా గురువారం టిడిపి కార్యాలయంలో మూడురాజధానులపై ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పల్లా మాట్లాడుతూ,  రైతులకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తుతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆడుతున్న మూడుముక్కలాట కు వ్యతిరేకంగా ఉద్యమించకపోతే భావితరాలకు కలిగే నష్టాలకు మనమే భాద్యత వహించాలని ఆవేదన వ్యక్తం చేసారు.రాష్ట్ర ప్రధానకార్యదర్శి మహ్మద్ నజీర్ మాట్లాడుతూ అమరావతి ప్రాముఖ్యాన్ని,గొప్పతనాన్ని దెబ్బతీసేవిధంగా వైసీపీ ప్రభుత్వం కుట్రపన్నిందని దుయ్యబట్టారు.కేవలం రాజధాని మాత్రమే కాకుండా పదమూడు జిల్లాల అభివృద్ధికి అవసరమైన సంపద సృష్టి,యువతకు ఉపాధికేంద్రంగా అమరావతిని నిర్మించాలని చంద్రబాబు నాయుడు ప్రణాళికలు రూపొందిస్తే,జగన్ అమరావతినే లేకుండా చెయ్యడానికి దుర్మార్గపు ఆలోచనలుచేశారని విమర్శించారు.ఐదుకోట్ల ఆంధ్రులు గర్వంగా చెప్పుకునేలా అమరావతిని రాజధాని ఎంపికచేస్తే సాక్షాత్తు శాసనసభలో ఒప్పుకున్న జగన్ రాష్ట్ర ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించేలా మూడురాజధానుల పేరుతో ఆటలాడుకుంటున్నారని నజీర్ మండిపడ్డారు.రాష్ట్ర ప్రజలందరి భవిష్యత్తు కోసం దాదాపు 29వేలమంది రైతులు  ముఫైమూడు వేల ఎకరాల భూములను త్యాగం చేసారన్నారు.గుజరాత్ లో గాంధీనగర్ దగ్గర గిఫ్ట్ సిటీ పేరుతో,అహ్మదాబాద్ దగ్గరలో దోలేరా పేరుతో కొత్తగా నగరాలు నిర్మిస్తున్నారన్నారు.అద్భుతంగా నిర్మిస్తున్న అమరావతిని ఈ రోజు శిధిలావస్థలో చూస్తుంటే బాధేస్తోందన్నారు.అనంతరం మూడురాజధానులు వద్దు ఒక్కరాజధానే ముద్దు,అమరావతి రైతులకు న్యాయం చెయ్యాలంటూ నాయకులు కార్యకర్తలు  రైతులకు మద్దతుగా  నినాదాలు చేసారు.ఈ కార్యక్రమంలో విల్లూరి డాక్టర్ చక్రవర్తి,వానపల్లి రవికుమార్,సర్వసిద్ది అనంతలక్ష్మి,పంపాన రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.