విశాఖలో సినిమా హిస్టరీ డాక్యుమెంటరీ ప్రదర్శన..
Ens Balu
2
Visakhapatnam
2020-12-17 21:25:15
జీవితంలో నిరంతరం ఎదురయ్యే ఒత్తిళ్ళ తో సతమతం అయ్యే ప్రతి మనిషికి సినిమా ఒక రిలీఫ్ ఇస్తుందనడంలో సందేహం లేదని.. సినిమా నటుడు, అభయ్ ప్రొడక్షన్స్ వ్యస్థాపకుడు ధనుంజయ్ అన్నారు. ఈ వినోద రంగంలో ఉండే సాధక బాధకాలను ఒక డాక్యుమెంటరీ ద్వారా ప్రపంచానికి వివరించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. గురువారం డాబాగార్డెన్స్ లోని విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. "సినిమా హిస్టరీ " పేరుతో నిర్మించిన ఈ డాక్యుమెంటరీ చిత్రాన్ని శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు కళా భారతి అడిటోరి యం లో ఏర్పాటు చేశామన్నారు. ప్రవేశం ఉచితమన్నారు. హైదరాబాద్ తర్వాత సినీ పరిశ్రమకి అత్యంత అనుకూల ప్రదేశం విశాఖపట్నం మాత్రమేనన్నారు. ఒక గంట నిడివి వుండే ఈ డాక్యుమెంటరీలో .. జూనియర్ ఆర్టిస్టులు మొదలుకొని అన్ని రంగాల వారి ఇతివృత్తాలను చూపిస్తామన్నారు. సినిమా రంగంలో అనుమతులకు ఇబ్బందులు పడుతున్నారు. ఔత్సాహికులు హాజరై.. తమ అనుభవాలు, ఇబ్బందులు, తెలియజేసే అవకాశం కల్పిస్తామన్నారు. వైజాగ్ జర్నలిస్టు ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ.. 1890 నుంచి ప్రస్తుత పరిస్థితి వరకు గడిచిన 125 సంవత్సరాలలో సంభవించిన అనేక మార్పులు, అనేక విషయాలను విశదీకరించే ప్రయత్నం చేస్తున్న ధనుంజయకు అభినందనలు తెలిపారు. సినిమా రంగం అంటే పూల పాన్పు కాదన్నారు. విశాఖపట్నం అంటేనే అందం, ఆహ్లాదం అని అభివర్ణించారు. బాదం గీర్ సాయి మాట్లాడుతూ.. కళాకారులు కళారంగానికి, పాత్రికేయులు తమ సహాయ సహకారాలను అందజేస్తున్నారన్నారు. ఈ మీడియా సమావేశంలో సునీల్ చరణ్, సత్య, ఎం ఎన్ ఆర్ తదితరులు పాల్గొన్నారు.