కరోనా టీకా ప్రాధాన్యత వైద్యసిబ్బందికే..


Ens Balu
2
Anantapur
2020-12-17 21:37:49

రాష్ట్ర ప్రభుత్వం  కోవిడ్ వ్యాక్సిన్ ను జిల్లాలో మొదటి దశలో 47818 మంది వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. అనంతపురం జిల్లా జనాభా 44,55,346 ఉండగా అందులో మొదటిదశలో  వైద్య ఆరోగ్యశాఖకు సంబంధించిన సిబ్బందికి టీకాలు  వేసేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం  ఆదేశించిందన్నారు.. ఆ మేరకు 18577 మంది ప్రభుత్వ ఆరోగ్య సంస్థల సిబ్బంది, 29241 మంది ప్రైవేట్ ఆరోగ్య సంస్థల నుండి లబ్ధిదారులుగా గుర్తించామన్నారు. ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన 18577 మంది టీకా లబ్దిదారుల్లో  వైద్య అధికారులు, స్టాఫ్ నర్సులు, ఎంఎల్హెచ్పిలు, ఎంపిహెచ్ఎస్ (ఎం అండ్ ఎఫ్), ఎంపిహెచ్ఎ (ఎం అండ్ ఎఫ్), ఎంపిహెచ్ఇఒ, పిహెచ్ఎన్, సిహెచ్ఒ మెడికల్ కాలేజీ విద్యార్థులు, ప్రభుత్వ నర్సింగ్ విద్యార్థులు, ఆశా, ఎడబ్ల్యుడబ్ల్యు / అయాస్,  యుపిహెచ్సిల సిబ్బంది ఉన్నారన్నారు. ప్రైవేట్ ఆరోగ్య సంస్థలకు సంబంధించిన టీకా లబ్ధిదారుల సంఖ్య 29241 మంది  కాగా , అందులో వైద్యులు, స్టాఫ్ నర్సు, ఇతర సిబ్బంది, ప్రైవేట్ నర్సింగ్ కళాశాల విద్యార్థులు ఉన్నారు.గుర్తించిన  లబ్దిదారులకు  వ్యాక్సిన్ వేసేందుకు 3950 మంది డాక్టర్లు, నర్సులు, ఎఎన్ఎం లను గుర్తించడం జరిగిందన్నారు.మొదటి దశలో ఒక పిహెచ్‌సిని ఒక సెషన్ సైట్‌గా  మొత్తం 135 సైట్ లలో అందరు ఆరోగ్య సంరక్షణ సిబ్బందికి టీకాలు వేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వ్యాక్సిన్ అందించే ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు  కలెక్టర్ ఛైర్మన్ గా జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ, మునిసిపల్ కమిషనర్ ఛైర్మన్ గాపట్టణ స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ, తహశీల్దార్ చైర్మన్ గా  మండల స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. అలాగే అనంతపురము జిల్లా వైద్య మరియు ఆరోగ్య  శాఖ అధికారి కార్యాలయంలో  08554 277434 ఫోన్ నంబర్ తో  కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు.  ఈ నెల 12,14 తేదీల్లో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర స్థాయిలో, 15 తేదీన  జిల్లా స్థాయి అధికారులు, ఎంహెచ్‌ఓ, మెడికల్ ఆఫీసర్లు, ఎస్‌ఓలు మరియు ఎఓలు (ఎన్‌హెచ్‌ఎం / ఎన్‌యుహెచ్‌ఎం), కోల్డ్ చైన్ హ్యాండ్లర్లకు ,16 వ తేదీన  పిహెచ్‌సిల పర్యవేక్షక సిబ్బందికి వ్యక్తిగతంగా  శిక్షణ పూర్తయిందన్నారు.  18 వ తేదీన  వ్యక్తిగతంగా COVID-19 టీకా యొక్క కార్యాచరణ మార్గదర్శకాలపై అన్ని వైద్య అధికారులకు, 21 వ తేదీన కోల్డ్ చైన్ హ్యాండ్లర్ లకు,  22 వ తేదీన ప్రత్యామ్నాయ వ్యాక్సిన్ డెలివరీ వ్యవస్థకు, 23 వ తేదీన ప్రైవేటు ప్రాక్టీషనర్లకు  శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నామన్నారు.. అలాగే 21వ తేదీ నుండి 24 వతేదీ వరకు  పిహెచ్‌సి స్థాయిలో  సూపర్‌వైజర్ సిబ్బంది, ANM లు, ASHA లు, అంగన్వాడీ వర్కర్లకు శిక్షణ ఇవ్వనున్నామన్నారు. వ్యాక్సిన్  నిల్వ చేసేందుకు డిఎంహెచ్ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా వ్యాక్సిన్ స్టోర్లో నిల్వ చేయబడుతుందన్నారు. ఇందుకు కావలసిన ఐస్ ప్యాక్స్, కోల్డ్ బాక్స్ లు, వాహనాలను సిద్ధం చేస్తున్నామన్నారు..                               కాగా రెండవ దశ లో  ఫ్రంట్ లైన్ కార్మికులకు అనగా మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, పోలీస్, రెవెన్యూ, పారిశుధ్యం మరియు ఇతర లైన్ విభాగాల సిబ్బందికి, కోమోర్బిడిటీస్ (రక్తపోటు, డయాబెటిస్,క్యాన్సర్లు, సిఓపిడి తదితర వ్యాధులు కల్గిన వారికి,మూడవ  దశ లో సాధారణ ప్రజలందరికీ టీకాలు అందించేందుకు ప్రభుత్వ అదేశాల మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ వివరించారు..