ఎస్సీల సంక్షేమానికి సమిష్టిగా పాటుపడాలి..


Ens Balu
3
Anantapur
2020-12-17 21:43:44

ఎస్సీ సంక్షేమ పథకాల అమలులో జిల్లా స్థాయి అధికారులు అందరూ సేవా దృక్పథంతో పనిచేసి వారి అభివృద్ధికి పాటుపడాలని రాష్ట్ర  షెడ్యూల్డు కులములు  శాసనసభా కమిటీ అధ్యక్షులు  గొల్ల బాబూరావు   పేర్కొన్నారు.  గురువారం   జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలోని  సమావేశ మందిరంలో  అంబేద్కర్ చిత్రపటానికి  పూలమాలలు వేసి  ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కార్యక్రమాలను ప్రారంభించారు . కలెక్టర్ గంధం చంద్రుడు అధ్యక్షతన  జిల్లాలో వివిధ సంక్షేమ పథకాలు    అమలులో  ఎస్సీ కులాల లబ్ధిదారుల ప్రగతి పై  సమీక్షించారు.  ఎస్ సి అట్రాసిటీ కేసుల పై  సమీక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సత్తి ఏసుబాబు,  పాల్గొన్నారు  ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ( కమిటీ సభ్యులు) ఎమ్మెల్యే. కొండేటి చిట్టిబాబు  ఎమ్మెల్యే .ఉన్న మట్ల ఎలిజ ఎమ్మెల్సీ శమంతకమణి, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి,జిల్లా సంయుక్త కలెక్టర్ (  రెవెన్యూ  మరియు  అభివృద్ధి)   నిశాంత్ కుమార, సంయుక్త  కలెక్టర్ ( సంక్షేమ  మరియు  అభివృద్ధి)   సిరి పెనుగొండ సబ్ కలెక్టర్  నీ శాంతి పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన ఈ కమిషన్  క్షేత్ర స్థాయిలో వివిధ జిల్లాల్లో పర్యటించి ఎస్సీల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా మా కమిటీ పని చేస్తుందని పేర్కొన్నారు.  జిల్లా పర్యటనలో నేను ఎంతో నేర్చుకున్నానని, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎస్ సి ల సంక్షేమం కొరకు అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నామని, వాటిని సక్రమైన మార్గంలో  అర్హులైన లబ్ధిదారులకు చేరవలసిన బాధ్యత మీ పైన ఉన్నదని పేర్కొన్నారు. జిల్లాలో పేదరికంలో ఎక్కువమంది అనగారిన వర్గాల ప్రజలు ఉన్నారని వారిని  ఆర్థికంగా ,సామాజికంగా, అభివృద్ధికి మీరు కృషి చేయాలని అధికారులను కోరారు. సాధ్యమైనంతవరకు  ఎస్సీ ప్రజలను  సమస్యలను పరిష్కరించాలని కోరారు ఉద్యోగాల కల్పనలో, ఆర్థిక భరోసా, ఆత్మ గౌరవం గా వారి జీవన ప్రమాణ స్థాయి ల ను మెరుగుపరచడానికి మనమందరం కలిసికట్టుగా కృషి చేయాలని పేర్కొన్నారు. మంచి  కష్టపడే  తత్వము కలిగిన జిల్లా కలెక్టర్  మీకు ఉన్నాడని, అతని ఆధ్వర్యంలో  మీరందరూ కలిసికట్టుగా కృషి చేసి జిల్లాను అభివృద్ధి పథంలో పయనించాలని ఆయన పేర్కొన్నారు.   పేదరికం ఎక్కడ అయితే ఎక్కువగా ఉంటుందో   అక్కడకూడా చైతన్య ఉంటుందని అని స్పష్టం చేశారు.  జనవరి మాసం లోపు  వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న  నాలుగో తరగతి  ఎస్సి ఉద్యోగాల భర్తీ చేయాలని ఆయన పేర్కొన్నారు. వివిధ ఎస్సీ ప్రజల నుంచి, దళిత సంఘాల నుంచి . రెవెన్యూ,  పోలీసు, సంక్షేమం, ఎస్సీ  అట్రాసిటీ కేసులు పై  సమస్యలపై 80% వినతులు స్వీకరించడం జరిగింది ని.  వాటినన్నిటిని  కలెక్టర్ కి అందజేయడం జరిగితుందని.  కలెక్టర్ వారి ఆధ్వర్యంలో మీ మీ శాఖలకు  ఆ వినతులు అందజేయడం జరుగుతుందని వాటిని డిసెంబర్ మాసం లోపు పరిష్కరించి మా కమిటీకి నివేదిక అందజేయాలని కోరారు. అలసత్వం వీడండి, అట్రాసిటీ కేసుల్లో బాధితులకు న్యాయం చేకూరేలా చూడండి. అసైన్మెంట్ భూములను ఎవరైనా కొనుగోలు చేస్తే కేసులు నమోదు చేయాలన్నారు. స్వాతంత్రం వచ్చి 74 సంవత్సరాలు దాటిన  అనగారిన వర్గాల ప్రజలు ఇంకా దుర్భరమైన జీవితం గడుపుతున్నారని ఆవేదన చెందారు.  ఉప్పర్ పల్లి లో సంఘటన నా మనసు కలచివేసింది అని ఆవేదన చెందారు.   ఎస్సీ వర్గాల ప్రజలకు   వివిధ చట్టాలపై  అవగాహన కార్యక్రమాలు  నిర్వహించాలని  ఎస్పీని కోరారు.  ప్రతి పైసా కూడా ప్రతి లబ్ధిదారులు చేరాలని కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నవరత్నాలు పథకాలు అమలు లో22 పథకాలు  ఎస్సీ లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుందని పేర్కొన్నారు. నాడు నేడు కార్యక్రమం ద్వారా జిల్లాలో1274 పాఠశాలలను డిసెంబర్ మాసం 31 తేదీ లోపల పూర్తి చేయడం జరుగుతుందని ఇందులో ఆరు లక్షల మంది విద్యార్థులు ఉండగా, ఎస్ సి విద్యార్థులు 45 వేలమంది  ఉన్నారని  తెలిపారు. మొదటి విడత పంతొమ్మిది వేల ఐదు వందలు ఎస్సీ ప్రజలకు ఇంటి నిర్మాణం పనులు శ్రీకారం చుడుతున్న మని పేర్కొన్నారు.1026 లేఅవుట్లు  ఇంటిగ్రేటెడ్ కాలనీలను  ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.  వివిధ సామాజిక భద్రత పింఛన్లు ద్వారా జిల్లాలో 70 వేల మంది    ఎస్సీ ప్రజలు లబ్ధి పొందుతున్నారని పేర్కొన్నారు.  స్టాండప్ ఇండియా పథకం ద్వారా  జిల్లాలో  ఎస్సీ, ఎస్ టి, మహిళ  అభ్యర్థులు 3000 మంది దరఖాస్తు చేసుకున్నారని, రుణ  10 లక్షల నుండి ఒక కోటి రూపాయల వరకు  రుణం సౌకర్యం లభిస్తుందని పేర్కొన్నారు. జిల్లాలో ఎస్సీ ప్రజలు అక్షర శాతం 56 శాతం ఉన్నదని. అన్ని శాఖల సహకారంతో  త్వరలో   ఎస్సీ ప్రజలలో అక్షరాస్యత శాతం పెంచడానికి   కృషిచేయడం జరుగుతుందని పేర్కొన్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ   డివిజన్ స్థాయిలో  ఎస్సీ వర్గాల ప్రజలకు   వివిధ చట్టాలపై  వర్క్ షాప్ నిర్వహించడం జరిగిందని తెలిపారు, మహిళలకు దిశా యాప్  అవగాహన కార్యక్రమాలు  సంబంధిత  గ్రామ సచివాలయ పోలీస్ అధికారి ఆధ్వర్యంలో  కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు లలో  పటిష్ఠంగా అమలు చేయడానికి మా యంత్రాంగం నిరంతరం కృషి చేస్తూ ఉందని పేర్కొన్నారు. ఇందుకు  సంబంధించిన నివేదికలు  కమిటీకి అందజేయడం జరుగుతుందని తెలిపారు.  అనంతరం   వివిధ శాఖలకు సంబంధించిన  పలు సంక్షేమ పథకాల అమలులో ఎస్సీ ప్రజలకు  ఇచ్చే రాయితీల పై  ప్రగతి నివేదికలు  ఆయా శాఖ హెచ్ ఓ డి లు  చదివి వినిపించారు.  డీఎస్పీలు  ఎస్సీ అట్రాసిటీ కేసులు పై సమగ్ర వివరాలను  సభలో చదివి వినిపించారు.   కంపాస్ నెట్ నియామకం  ఉద్యోగ ధ్రువపత్రాన్ని అందజేశారు.    కనేకల్లు గ్రామ పంచాయతీ కార్యాలయంలో స్వీపర్ గా  పని చేస్తూ,సర్వీసులో ఉండగానే మరణించిన ఎర్రిస్వామి కారుణ్య నియామక క్రింద అతని కుమారునికి ముదిగుబ్బ గ్రామ పంచాయతీ కార్యాలయంలో  బిల్ కలెక్టర్ గా  రాజయ్య కు నియామక పత్రామును అందజేసిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర షెడ్యూల్డు కులములు శాసనసభా కమిటీ అధ్యక్షులు శ్రీ గొల్ల బాబూరావు,జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు  అందజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.