కర్నూలులో మంచినీటి సరఫరాలో అంతరాయం..


Ens Balu
2
Kurnool
2020-12-17 21:45:19

కర్నూలు నగరంలో శుక్రవారం పలు ప్రాంతాలకు మంచినీటి సరఫరాకు అంతరాయం కలగనుందని నగర పాలక కమిషనర్ డి.కె.బాలాజీ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్థానిక కిసాన్ ఘాట్ మార్గంలో ఉన్న జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ స్విమింగ్ పూల్(ఈత కొలను) వద్ద మంచినీటి సరఫరా అయ్యే ప్రధాన పైప్ లైన్ మార్పుతో పాటు కొంత మరమ్మతుల పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో శుక్రవారం నగరంలోని బుధువారపేట, హాబీ ముబారక్ నగర్, సంజయ్ గాంధీ నగర్, స్వామిరెడ్డి నగర్, లక్ష్మీ గార్డెన్స్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, మారుతీ హోమ్స్, జోహారాపురం తదితర ప్రాంతాలకు మునిసిపల్ మంచినీటి సరఫరా కు అంతరాయం కలగనుందని తెలియజేశారు. నగర పాలక ఇంజినీరింగ్ అధికారుల పర్యవేక్షణలో యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేసి తిరిగి సరఫరాను పునరుద్ధరిస్తామని చెప్పారు.