మొక్కతోనే జీవకోటికి ప్రాణవాయువు..
Ens Balu
2
Vizianagaram
2020-12-17 21:56:52
మొక్క పచ్చదనాన్ని పెంపొందిండచంతోపాటు మనిషి ప్రాణవాయువుకి జీవనాధారమని రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ ఆర్.శ్రీనివాసరావు పేర్కొన్నారు. విజయనగరం జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా ఆయన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరిజవహర్ లాల్ తో కలిసి స్థానిక జిల్లాపరిషత్ అతిధిగృహం వద్ద గురువారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హరిత విజయనగరం స్థాపనకోసం జిల్లాలో జరుగుతున్న కృషిని కమిషనర్ అభినందించారు. అంతేకాకుండా ప్రతీ ఒక్క ఉద్యోగి ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాల్లో మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యత కూడా వాళ్లే తీసుకోవాలని తద్వారా ఆ మొక్క పెద్దదై పెద్ద చెట్టుగా మారిన తరువాత అది మరో పది మందికి ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాల్లో నీడనివ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ ఎం.గణపతిరావు, మున్సిపల్ కమిషనర్ ఎస్ఎస్ వర్మ, ఆర్‌డిఓ బిహెచ్ భవానీశంకర్, డిఎఫ్ఓ ఎస్.జానకిరావు, హౌసింగ్ పిడి ఎస్‌వి రమణమూర్తి, కలెక్టరేట్ ఏఓ దేవ్ ప్రసాద్, మున్సిపల్ ప్లాంటేషన్ అవనాపు రవి తదితరులు పాల్గొన్నారు.