ఇళ్ల పంపిణీ కార్యక్రమానికి పక్కా ఏర్పాట్లు..
Ens Balu
3
Kothapalli(Haveli)
2020-12-17 22:16:47
నవరత్నాలు- పేదలందరికీ ఇళ్ళు పధకంలో భాగంగా యు.కొత్తపల్లి మండలం కొమరగిరి గ్రామంలో ఈ నెల 25వ తేదీన ముఖ్యమంత్రి చే ప్రారంభించే ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమానికి కావలసిన అన్ని ఏర్పాట్లు సిధ్ధం చేయాలని జిల్లా కలక్టర్ డి.మురళీధర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం కలక్టర్ డి.మురళీధర్ రెడ్డి ముఖ్యమంత్రి ప్రోగ్రామ్ కొఆర్డినేటర్ తలసరి రఘురామ్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే డి.చంద్రశేఖరెడ్డిలతో కలిసి యు.కొత్తపల్లి మండలం కొమరగిరి గ్రామంలో నిర్మించనున్న నవరత్నాలు- పేదలందరికీ ఇళ్ళు ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలక్టర్ మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమం జరుగుతుందన్నారు. 25వ తేదీన మధ్యహ్నం ముఖ్యమంత్రి మధురపుడి విమానాశ్రయం నుండి హెలికాప్టర్ ద్వారా నేరుగా కొమరగిరి గ్రామంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారన్నారు. హెలిప్యాడ్ నుండి బయలుదేరి అక్కడే ఏర్పాటు చేసిన ప్రత్యేక ఫైలాన్ ను ఆవిష్కరిస్తారన్నారు. అనంతరం లబ్దిదారులకు ఇచ్చే ఇంటి మోడల్ గా నిర్మించిన ఒక గృహాన్ని ముఖ్యమంత్రి సందర్శిస్తారన్నారు. అనంతరం అక్కడ లబ్దిదారులతో ఏర్పాటు చేసిన వారితో ముఖ్యమంత్రి మాట్లాడతారని కలక్టర్ తెలిపారు.
అంతకు ముందు కలెక్టరేట్ వివేకానంద హాలులో జిల్లా స్ధాయి అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ముఖ్యమంత్రి ప్రారంభించే ఇళ్ళ పట్టాల కార్యక్రమం కొరకు సన్నాహక ఏర్పాట్లపై కలక్టర్ సమీక్షించారు. కార్యక్రమానికి హాజరైయ్యే లబ్దిదారులకు ఆహారం,త్రాగునీరు,రవాణా సదుపాయాలలు కల్పించి ప్రారంభోత్సవ కార్యక్రమానికి తీసుకురావలని కాకినాడ నగర పాలక సంస్ధ కమీషనర్ కు సూచించారు. పంచాయతీ అధికారులు మంచి నీరు సరఫరా, పారిశుధ్య పనులు చేపట్టాలన్నారు. వివిధ శాఖలకు కేటాయించిన పనులు సజావుగా జరిగే విధంగా ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని కలక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో పోలీస్ సూపరింటెండెంట్లు షీమోషి బాజ్ పాయి, అద్నాన్ నయీమ్ అస్మి, జాయింట్ కలక్టర్లు జి.లక్ష్మిశ, జి.రాజకుమారి, సబ్ కలక్టర్లు అనుపమా అంజలి, హిమాన్షు కౌశిక్, డిఆర్ఓ సిహెచ్.సత్తిబాబు, అడిషనల్ ఎస్.పి., సుమిత్ గార్గ్, జిల్లాలోని ఆర్.డి.ఓ.లు , జిల్లా స్ధాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.