18న లబ్దిదారులు బ్యాంకుకి రావాలి..


Ens Balu
2
కాకినాడ
2020-12-17 22:24:51

ఫోర్ వీలర్ మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ల కొరకు కాకినాడ, పెద్దాపురం డివిజన్లకు సంబంధించిన లబ్దిదారులు ఈనెల 18వ తేదీ ఉదయం 9 గం.ల నుండి కాకినాడ, రంగరాయ వైద్య కళాశాల ఆడిటోరియంలో  బ్యాంక్ ఆఫ్ బరోడా నిర్వహించే డాక్యుమెంటేషన్ కార్యక్రమానికి హాజరు కావాలని జాయింట్ కలెక్టర్ (ఆభివృద్ది) కీర్తి చేకూరి ఒక ప్రకటనలో తెలిపారు.  అభ్యర్థులు తమతో పాటు లబ్దిదారు వాటా మొత్తం 65 వేల రూపాయలతో ఈ డాక్యుమెంటేషన్ కార్యక్రమానికి హాజరు కావలసి ఉంటుందని ఆమె తెలిపారు.  అలాగే రాజమండ్రి, రామచంద్రపురం డివిజన్ల లబ్దిదారులకు ఈనెల 19వ తేదీన, అమలాపురం డివిజన్ లబ్దిదారులకు 20వ తేదీన, రంపచోడవరం, ఎటపాక డివిజనల్ల లబ్దిదారులకు 21వ తేదీన ఈ డాక్యుమెంటేషన్ నిర్వహిస్తారని తెలియజేశారు. తమ పరిధిలోని లబ్దిదారులు అందరూ డాక్యుమెంటేషన్ ప్రక్రియకు విధిగా హాజరైయ్యేట్లు చూడాలని డివిజన్ డవలెప్మెంట్ అధికారులు, మున్సిపల్ అధికారులను జాయింట్ కలెక్టర్(డి) ఆదేశించారు.  మొత్తం 1,059 మంది లబ్దిదారులకు గాను, డివిజన్ల వారీగా కాకినాడ(139), పెద్దాపురం(181), రాజమండ్రి(140), రామచంద్రపురం(123), అమలాపురం(218), రంపచోడవరం(46), ఎటపాక (29), 12 మున్సిపల్ ఆర్భన్ ప్రాంతాల్లో (183) మంది లబ్దిదారులు ఈ కార్యక్రమాలకు హాజరు కావలసి ఉందన్నారు.