ఉత్తరాంధ్రా అభివ్రుద్ధి ద్రోహి చంద్రబాబు..


Ens Balu
2
Visakhapatnam
2020-12-18 19:51:11

ఉత్తరాంధ్ర ద్రోహి చంద్రబాబు నాయుడని  విశాఖ వైఎస్సార్సీపీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మల మండిపడ్డారు. శుక్రవారం విశాఖలో మూడు రాజధానుల విషయంలో చంద్రబాబు వైఖరిని నిరసిస్తూ ఎంవిపి కాలనీ టీటీడీ కళ్యాణ మండపం నుంచి  ఇసుకతోట జంక్షన్ వరకు  ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కరమాని మాట్లాడుతూ,  వైజాగ్ ఎగ్జిక్యూటివ్ రాజధాని రానివ్వకుండా అడ్డుపడుతు ఈ ప్రాంత అభివ్రుద్ధిని కాలరాయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రాజధానుల ఏర్పాటుతోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యపడుతుందన్న ఆలోచనతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారన్నారు. విశాఖ రాజధానిని ఉత్తరాంధ్ర ప్రజలు స్వాగతిస్తుంటే, చంద్రబాబు నాయుడు, విశాఖలోని ముగ్గురు టిడిపి ఎమ్మెల్యేలు వ్యతిరేకించడం ఇక్కడి ప్రజల మనోభావాలను దెబ్బతీయడమేనన్నారు. ఈ ర్యాలీలో అక్కరమాని  వెంకటరావు, 9 వార్డు వైసిపి నాయకులు ఉమ్మడి స్వాతి దాస్ పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని చంద్రబాబు కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున వైఎస్సార్సీపి కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.