శిష్టకరణాలను గుర్తించిన దేవుడు సీఎం వైఎస్ జగన్..


Ens Balu
3
Visakhapatnam
2020-12-18 19:56:52

బీసీ సామాజిక వర్గానికి సముచిత న్యాయం చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని శిష్టకరణ కార్పొరేషన్ చైర్పర్సన్ కంటిమహంతి అనూష పట్నాయక్ అన్నారు. గురువారం విజయవాడలో  శిష్టకరణ కార్పొరేషన్ చైర్పర్సన్ గా ప్రమాణ స్వీకారం చేసిన ఆమె శుక్రవారం నగరానికి చేరుకున్నారు. విశాఖ ఎయిర్ పోర్టు నుంచి రామ్ నగర్ లోని ఆమె నివాసం వరకు ర్యాలీగా వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, 73ఏళ్ల స్వతంత్ర్య భారత దేశంలో శిష్టకరణాలను గుర్తించి వారికి కార్పోరేషన్ ఏర్పాటు చేసిన దేవుడు సీఎం వైఎస్ జగన్ మాత్ర మేనన్నారు.  బీసీల అభివృద్ధి కోసం 56 బీసీ కార్పొరేషన్ లు  ఏర్పాటు చేయడం హర్షదాయకమని, ఆమె సీఎంకు కృతజ్ఞతలు తెలియజేశారు. శిష్ట కర్ణాల సంక్షేమానికి, బీసీల అభ్యున్నతికి తన వంతు పూర్తి కృషి చేస్తానని చెప్పారు. శిష్టకరణ సంఘం అధ్యక్షులు, ప్రముఖ న్యాయవాది ఎస్ ఎన్ కె మహంతి మాట్లాడుతూ,  మహానేత స్వర్గీయ వైయస్ఆర్ శిష్ట కర్ణాలను బీసీల్లో  చేరిస్తే నేడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం హర్షదాయకం అన్నారు. బీసీలంతా వైసిపి ప్రభుత్వానికి రుణపడి ఉంటామని, ఎప్పటికీ తామంతా జగన్ వెంటే నడుస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జయతి శశిధర్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ఎయిర్ పోర్టులో చైర్ పర్శన్ కు ఘన స్వాగతం లభించింది.