సమర్ధవంతంగా విధులు నిర్వర్తించాలి..
Ens Balu
2
Kurnool
2020-12-18 19:59:55
వార్డు సచివాలయ కార్యదర్శులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ సంక్షేమ ఫలాలను ప్రజలకు చేరువచేస్తూ సమర్ధవంతంగా విధులు నిర్వర్తించాలని నగర పాలక కమిషనర్ డి.కె.బాలాజీ సూచించారు. శుక్రవారం ఆయన నగరంలోని 45 వ వార్డు పరిధిలోని నరసింహారెడ్డి నగర్ 119వ వార్డు సచివాలయం, అశోక్ నగర్ లోని 120వ వార్డు సచివాలయం, 43వ వార్డు పరిధి రామలింగేశ్వర్ నగర్ లోని 115 వ సచివాలయం, 39వ వార్డు పరిధి మమత నగర్ లోని 103వ సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సంబంధిత సచివాలయాల్లో సిబ్బంది హాజరు పట్టిక, వినతుల పరిష్కారం, ఉద్యోగుల మూవ్మెంట్ రిజిస్టర్ నమోదులను ఆయన పరిశీలించారు. వార్డు సచివాలయ కార్యాలయంలో సంక్షేమ పథకాల క్యాలెండర్, సచివాలయ ఉద్యోగుల ఫోన్ నంబర్లతో కూడిన చార్ట్, సంక్షేమ క్యాలెండర్, కోవిడ్ నియంత్రణ సూచికల బోర్డ్ లు ఉన్నాయా లేదా అని అరా తీశారు. ఇప్పటివరకు ప్రజల నుంచి సచివాలయానికి ఎన్ని సర్వీసులు వచ్చాయి, వాటిలో ఎన్ని వినతులను పరిష్కరించారనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. సచివాలయాల పరిధిలో ఎన్ని నీటి కుళాయి కనెక్షన్లు ఉన్నాయి..వాటికి సక్రమంగా నీటి పన్ను చెల్లిస్తున్నారని వార్డు ఏమినీటి కార్యదర్శులను అడిగి తెలుసుకున్నారు. మొండి నీటి పన్న బకాయిదారులు ఎవరైనా ఉంటే వారికి వెంటనే నీటి కుళాయి కనెక్షన్ లను తొలగించాలని ఆదేశించారు. సచివాలయాల పరిధిలో ఎన్ని అక్రమ కట్టడాలను గుర్తించారని వార్డు ప్లానింగ్ కార్యదర్శులను అరా తీశారు. ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా విధులకు రాకపోతే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే సమయంలో వార్డు వలింటీర్ల కోవిడ్ జాగ్రత్తల గురించి ఇంటింటా అవగాహన కల్పించాలని చెప్పారు.