22న స్వామి వారి హుండీ లెక్కింపు..


Ens Balu
2
Srikakulam
2020-12-18 21:03:21

శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలోని శ్రీసూర్యనారాయణ స్వామి వారి దేవస్థానం హుండీలను ఈ నెల 22న లెక్కించనున్నట్లు దేవాదాయ, ధర్మాదాయ శాఖ సహాయ కమీషనర్ మరియు ఆలయ కార్యనిర్వహణాధికారి వి.హరిసూర్యప్రకాష్ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేసారు. దేవస్థానం హుండీలను డిసెంబర్ 22 మంగళవారం ఉదయం 09.00గం.లకు 40 మంది సిబ్బందితో లెక్కించనున్నట్లు ఆయన చెప్పారు.  ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ సిబ్బంది, అనువంశిక ధర్మకర్త, పాలకమండలి సభ్యులు, ఆలయ అర్చకులు, భక్తులు, గ్రామపెద్దల సమక్షంలో స్వామి వారి హుండీ లెక్కింపు కార్యక్రమం జరుగుతుందని ఆయన ఆ ప్రకటనలో వివరించారు. కోవిడ్ ను ద్రుష్టిలో ఉంచుకొని సామాజిక దూరం, మాస్కు ధారణ, పరిశుభ్రతలకు ప్రాధాన్యత నిస్తూ ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు ఈఓ ఆ ప్రకటనలో వివరించారు.