పెదపాడు చెరువు సుందరీకరణ..


Ens Balu
2
Srikakulam
2020-12-18 21:27:32

శ్రీకాకుళంలోని పెదపాడు చెరువు సుందరీకరణకు చర్యలు చేపడుతున్నట్లుగా జిల్లా కలెక్టర్ జె. నివాస్ తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయపు  సమావేశ మందిరంలో పెదపాడు చెరువు సుందరీకరణపై సమావేశం నిర్వహించారు. జిల్లాలో  ప్రజలకు కేవలం సినిమా ఒక్కటే వినోదం కలిగించే సాధనం మన్నారు. అదే విధంగా వాకింగ్ కి కూడా కేవలం ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ మాత్రమే అవకాశం వుందన్నారు. కావున  పెదపాడు చెరువును రూ.7.50 కోట్లతో మంచి రిక్రియేషన్ పార్కుగాను,   అధునాతనంగాను   సుందరీకరణతోను రూపొందించే చర్యలు చేపట్టనున్నట్లు  తెలిపారు.  తద్వారా జిల్లా ప్రజలు  కుటుంబంతో సెలవు రోజులలో సంతోషంగా గడిపే అవకాశం వుంటుందన్నారు. కావున పరిశ్రమలు, స్వఛ్ఛంద సంస్ధలు, సామాజిక బాధ్యతగా చెరువు అభివృధ్ధికి తమ వంతు సహకారం  అందించాలని అన్నారు. అనంతరం మాజీ మంత్రివర్యులు, శాసన సభ్యులు ధర్మాన ప్రసాద రావు మాట్లాడుతూ, శ్రీకాకుళం అతి చిన్న పట్టణమని, తర తరాలుగా వెనుక బడి వున్నదని అన్నారు.  జిల్లా  కలెక్టర్ గారి ఆలోచన చాలా మంచిదన్నారు. జిల్లాలో  మంచి ఆహ్లాదకర వాతావరణం వుందని, వంశధార, నాగావళి నదులు, సుదీర్ఘ సముద్ర తీర ప్రాంతం వున్నాయన్నారు.   ఇప్పటి వరకు నిరుపేదలకు 70 లక్షల ఎకరాల వరకు భూములను పంచడం జరిగిందన్నారు.   జిల్లాలోని ప్రజలకు రిక్రియేషన్ కలిగించడానికి పెదపాడు చెరువును అభివృధ్ధి చేసి సుందరీకరణకు ముందడుగు వేయడం చాలా హర్షించదగ్గ విషయమన్నారు.  పెదపాడు చెరువు పట్టణానికి చేరువలో వుందని, ఇరువైపుల నది  వుందని, త్వరలోనే  కార్పొరేషన్ గా రూపొందనున్నదని తెలిపారు.  పరిశ్రమలు సామజిక బాధ్యతగా  తమ వుంతు సాయమందించాలన్నారు. మంచి పార్క్, వాకింగ్ ట్రాక్, పిల్లలకు రిక్రియేషన్ కలిగించే విధంగా సుందరీకరణ చేయాలని, భావి తరాలకు, పిల్లలకు మంచి పట్టణాన్ని అందించాలని అన్నారు.  ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు కావాలి. ప్రజలకు ఆహ్లాదం అందించాలని పరిశ్రమలు, స్వఛ్ఛంద సంస్థలు  ఈ కార్యక్రమంలో సాయమందించాలన్నారు.                         ఈ కార్యక్రమంలోఅడిషనల్ ఎస్.పి. సోమశేఖర్, జిల్లా నీటి యాజమాన్య సంస్థ పి. డి. హెచ్. వి. కూర్మారావు, జిల్లా పంచాయతీ అధికారి రవి కుమార్, ఆర్ డి ఓ కిషోర్,ఎం డి ఓ,ప్రకాష్,  పరిశ్రమల జిల్లా మేనేజర్ గోపాల కృష్ణ, డా. దానేటి శ్రీధర్, అంబేద్కర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్  తులసీ రావు,అరబిందో పరిశ్రమల యాజమాన్యం, ఎన్ ఎ సి ఎల్. సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సి వి. రాజులు, డి జి ఎం   పి ఎస్ వి ఎస్ ఎన్. వర్మ,  ఎ.పి. గ్రీన్ కార్పోరేషన్ జోనల్ మేనేజరు జి.మంగమ్మ, గీతా శ్రీకాంత్, సురంగి మెహన్ రావు,,రోటరీ క్లబ్, బ్రెడ్స్, తదితర స్వచ్చంద సంస్థలు, తదితరులు పాల్గొన్నారు.