గిరిజన విద్యార్ధులకు బి.ఇ.డి అవకాశం..


Ens Balu
3
Parvathipuram
2020-12-18 21:53:17

ఆంధ్రప్రదేశ్ లోని ఏజెన్సీ షెడ్యూల్ ప్రాంత గిరిజన అభ్యర్థుల సంక్షేమార్థం భద్రాచలం ఐ.టి.డి.ఎ ఆధ్వర్యంలో నిర్వహించ బడుతున్న ప్రత్యేక గిరిజన బి. ఇ.డి కళాశాలలో 2020 - 2022 విద్యాసంవత్సరం నకు గాను (22 వ బ్యాచ్) 2 సంవత్సరాల రెగ్యులర్ బి.ఎడ్ కోర్సులో ప్రవేశం నిమిత్తం ఏజెన్సీ షెడ్యూల్ ప్రాంత గిరిజన పట్టభద్రుల నుండి నేరుగా దరఖాస్తులు కోరుతున్నట్టు పార్వతీపురం ఐటిడిఏ పీఓ కూర్మనాధ్ కోరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, గిరిజన అభ్యర్ధులు బిఈడిలోకి ప్రవేశాల కోసం తెలంగాణా , ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన అభ్యర్థులు ఏజెన్సీ షెడ్యూల్ ప్రాంతాలకు చెందిన గిరిజన పట్టభద్రులై ఉండాలని,  40 శాతం మార్కులతో డిగ్రీ పాస్ అయి ఉండాలని,  డిగ్రీ పరీక్షలో సాధించిన మెరిట్ ని బట్టి ఎంపిక జరుగుతుందని చెప్పారు. కాగా  మహిళలకు, ప్రత్యేక కేటగిరీ వారికి సీట్లు రిజర్వు చేసినట్టు వివరించారు.  ప్రభుత్వ ఉతర్వు లు నంబర్ 13, తేదీ 27-5-2017 నంబర్ : 53, తేదీ 19-5-2009 ప్రకారం మెరిట్ ఆధారంగా ఈ ఎంపిక జరుగుతుందన్నారు.   పార్వతీపురం ఐటిడిఎ సబ్ ప్లాన్ మండలాలలో ఉన్న విద్యార్థులకు పార్వతీపురం ఐ టి డి ఎ కార్యాలయంలో ప్రాస్పెక్ట్ , దరఖాస్తులు ఉచితంగా పొందవచ్చు, అలాగే పోస్ట్ ద్వారా దరఖాస్తులు పొందగోరి అభ్యర్థులు తమ సొంత చిరునామా గల కవర్(రూ.10/- స్టాంప్ ఆతికించి) ను ప్రిన్సిపాల్, గిరిజన విద్యా కళాశాల, భద్రాచలం కు పంపి దరఖాస్తు పొందవచ్చు. దరఖాస్తు పూర్తిగా చదివి సక్రమంగా పూర్తిచేసి జనవరి8, 2021 నాటికి కార్యాలయానికి అందేవిధంగా పంపించాలని ఐ.టి.డి.ఎ ప్రాజెక్ట్ అధికారి  ఆర్ కూర్మనాథ్  తెలిపారు.