నష్ట పరిహారాలు సత్వరమే అందజేయాలి..
Ens Balu
1
Vizianagaram
2020-12-18 21:55:28
ప్రభుత్వ పరంగా అందవలసిన పరిహారాన్ని షెడ్యూల్ కులాల, తెగల వారికి సత్వరమే అందేలా చూడాలని సంయుక్త కలెక్టర్(ఆసరా) జే. వెంకట రావు తెలిపారు. శుక్రవారం కల్లెక్టరేట్ ఆడిటోరియం లో ఎస్.సి., ఎస్.టి కులాల పై జరిగే దాడుల నిరోధ మానిటరింగ్ కమిటీ 3వ త్రై మాసపు సమావేశం జే.సి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జే.సి మాట్లాడుతూ అక్టోబర్ 1 నుండి డిసెంబర్ 14 మధ్య ఎస్.సి , ఎస్.టి కులాలకు చెందిన 16 కేసులకు గానూ 8 కేసులకు పరిహారం అందించారని, మిగిలిన 8 కేసులకు పరిహారాన్ని వెంటనే అందజేయాలని జిల్లా రెవిన్యూ అధికారికి తెలిపారు. డి.ఆర్.ఓ గణపతి రావు మాట్లాడుతూ 8 కేసులు ఇంకా ట్రైల్ లో ఉన్నాయని, తీర్పు వెలువడిన వెంటనే పరిహారం అందిస్తామని తెలిపారు. అక్టోబర్ 1 నుండి నవంబర్ 30 వరకు వివిధ పోలీస్ స్టేషన్లలో 13 కేసులు దర్యాప్తు లో నున్నాయని, అందులో 8 కేసులు సాక్ష్యాల పరిశీలనలో ఉన్నాయని, నాలుగు కేసులు కుల ధృవీకరణ, ఒకటి మెడికల్ సర్టిఫికెట్స్ కోసం పెండింగ్ ఉన్నాయని తెలిపారు.
కుల ధృవీకరణ పత్రాలను త్వరగా అందజేయడం ద్వారా కేసులను త్వరగా పరిష్కరించవచ్చని అన్నారు. గత సమావేశపు అంశాలను, వాటి పరిష్కారాలను ముందుగా చర్చించారు. సభ్యల వినతులను రాసి సాంఘిక సంక్షేమ శాఖ కు అందజేయాలని, వాటిని పరిశీలించి తదుపరి సమవేశానికి వాటి పై చర్యలను తెలియజెస్తామని జే.సి తెలిపారు. ఈ సమావేశం లో శాసన మండలి సభ్యులు పెనుమత్స సురేష్ బాబు, విజయనగరం ఆర్. డి. ఓ భవాని శంకర్, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు సునీల్ రాజ్ కుమార్, డుమా ప్రాజెక్ట్ డైరెక్టర్ నాగేశ్వర రావు, మున్సిపల్ కమీషనర్ వర్మ, పోలీస్, పలు శాఖల అధికారులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.