జిఇఆర్ పెంపునకు ప్రభుత్వ చర్యలు..
Ens Balu
1
ఆంధ్రాయూనివర్శిటీ
2020-12-18 22:21:20
విద్యా రంగంలో గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్ రేషియో(జిఇఆర్) పెంపుకు ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలు దోహదకారిగా నిలుస్తాయని ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి అన్నారు. ఉన్నత విద్యా మండలి శుక్రవారం ఉదయం ‘ఎన్‌హేన్స్‌మెంట్ ఆఫ్ జిఇఆర్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్ ఏపి-ఎప్రోచెస్ అండ్ స్ట్రాటజీస్’ ప్యానల్ డిస్కషన్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ స్థూల నమోదు నిష్పత్తి కంటే రాష్ట్ర స్థూల నమోదు నిష్పత్తి అధికంగా ఉండే దిశగా కృషి జరగాలని సూచించారు. ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన రెడ్డి ఉన్నత విద్యను పూర్తిస్థాయిలో ప్రోత్సాహం కల్పిస్తున్నారన్నారు. జగనన్న విద్యా దీవెతనకు అదనంగా జగనన్న వసతి దీవెన పథకం అమలు చేయడంతో పేద విద్యార్థులు పూర్తిస్థాయిలో విద్యలో రాణించడం సాధ్యపడుతోందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న పథకాలు భవిష్యత్ కాలంలో రాష్ట్రంలో ఉన్నత విద్యావంతుల సంఖ్యను గణనీయంగా పెంపుదల చేసే దిశగా నిలుస్తోందన్నారు. కార్యక్రమంలోఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి ఆచార్య వి.బాలమోహన్ దాస్, ఉన్నత విద్యామండలి చైర్మన్ కె. హేమచంద్రారెడ్డి తదితరులు పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.