ఇందనాన్ని అత్యంత పొదుపుగా వినియోగించాలి..


Ens Balu
3
Nellore
2020-12-18 22:39:13

విద్యుత్ పొదుపుగా వాడుకుంటే భావితరాల భవిష్యత్తు  బావుంటుందని జిల్లా కలెక్టర్  కె.వి.ఎన్  చక్రధర్ బాబు అన్నారు.  శుక్రవారం సాయంత్రం వేదాయపాలెం లోని కరెంట్ ఆఫీస్ వద్ద   జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు( 14 డిసెంబర్ నుండి 20 డిసెంబర్ వరకు)  సందర్బంగా  జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మానవ ధైనందిక జీవితంలో  తిండి , నీరు , బట్టలు  లాగ, విద్యుత్  కూడా ఒక   అవసరమని , పరిశ్రమల నుండి  మిక్సీ  వరకు ఏది నడవాలన్న   విద్యుత్ అవసరం  అయినందున  ప్రతి ఒక్కరు విద్యుత్ ను పొదుపుగా వాడాలన్నారు . విద్యుత్  ప్రతి ఒక్కరికి అవసరం అయినందున పొదుపుగా వాడుకుంటే భావి తరాల వారి భవిష్యత్ బావుంటుందన్నారు . ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా అవసరం లేనప్పుడు ఫ్యాన్లు లైట్లు స్విచ్ ఆఫ్ చేసుకోవాలన్నారు . అదేవిదంగా ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా పాటించాలన్నారు. విద్యుత్   వస్తువులు కొనేటప్పుడు 3 స్టార్స్  ఉన్న పరికరాలు    కొనుగోలు చేస్తే తక్కువ విద్యుత్ వాడటం జరుగుతుందన్నారు.  ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా విద్యుత్ వివియోగాన్ని తగ్గించుకొని   విద్యుత్ ను   పొదుపు చేయాలన్నారు . రాష్ట్ర ప్రభుత్వం    వ్యవసాయ రంగానికి     పగటి పూట  9 గంటలు  నాణ్యమైన విద్యుత్ ను అందిస్తుoదన్నారు . దీని వలన విద్యుత్ విభాగం పై కొంత భారం పడిందన్నారు. అందు వలన అన్ని రంగాల వారు విద్యుత్ పొదుపును పాటించాలన్నారు .  అన్ని రంగాలకు ఎలక్ట్రిక్ కన్సర్వేషన్  ముఖ్యమైన అంశమన్నారు.  ప్రతి ఒక్కరు విద్యుత్   వారోత్సవాల్లో పాల్గొని విజయవంతం  చేయాలన్నారు .  అనంతరం జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల ర్యాలీ ని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు.   ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డా హరేందిర  ప్రసాద్ , విద్యుత్ శాఖ అధికారులు , సిబ్బంది పాల్గొన్నారు.