సచివాలయాల ద్వారానే సేవలందాలి..
Ens Balu
3
Kovur
2020-12-18 22:45:52
గ్రామసచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రజలకూ సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కె వి ఎన్ చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కోవూరు మండలం లోని , వేగూరు గ్రామం రైతు భరోసా కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేసారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ రోజుకు ఎంత మంది రైతులు రైతు భరోసా కేంద్రాలకు వస్తున్నారు ? రైతులు ఎం ఎం అడుగుతున్నారు తదితర వివరాలను జిల్లా వ్యవసాయ అధికారిని అడిగి తెలుసు కున్నారు. రైతు భరోసా కేoద్రం లోని విత్తనాల స్టాక్ ను పరిశీలించారు. ఎకరానికి ఎంత విత్తనం అవసరమౌతుంది , ఏ ఏ రకాల విత్తనాలు సరఫరా చేస్తున్నారు? ఎన్ని క్వింటాళ్ల విత్తనాలు వచ్చాయి? ఎంత పంపిణి జరిగింది ? మొదలైన వివరాలు అడిగి తెలుసుకున్నారు . అనంతరం రైతులతో సమావేశమైన జిల్లా కలెక్టర్ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అందరూ విత్తనాలు తీసుకున్నారా అధికారులందరూ మీకు బాగా సహకరిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు జిల్లా కలెక్టర్ రైతులకు విత్తనాలు పంపిణి చేశారు.
అనంతరం జిల్లా కలెక్టర్ మీడియా వారితో మాట్లాడుతూ నివర్ తుఫాను ప్రభావం వలన జిల్లాలో నవంబర్ 24 నుండి వారం రోజుల పాటు ఏడ తెరిపి లేకుండా వర్షాలు కురిశాయని జిల్లా వ్యాప్తంగా 27,000 హెక్టర్లలో వ్యవసాయం దెబ్బతిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఈ నెలాఖరుకు ఇన్పుట్ సబ్సీడీ చెల్లిస్తుందన్నారు . తుఫాన్ ప్రభావిత గ్రామాలలో 80 శాతం సబ్సీడీ తో నాణ్యమైన విత్తనాలను అందిస్తుందన్నారు. 665 రైతు భరోసా కేంద్రాలు సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా 15,840 క్వింటాల్స్ విత్తనాలను రైతులకు పంపిణి చేస్తుందన్నారు. కౌలు రైతులు, ప్రభుత్వ భూములలో వ్యవసాయం చేసుకునే వారికి కూడా సబ్సీడీ తో విత్తనాలు సరఫరా చేయబడతాయి అన్నారు . రైతులందరు వారికి దగ్గరలోని రైతు భరోసా కేంద్రాలకు వెళ్లి విత్తనాలు తీసుకోవచ్చన్నారు . రైతు భరోసా కేంద్రాల ద్వారా రసాయన ఎరువులు, పురుగు మందులు కూడా సరఫరా చేయబడతాయి అన్నారు. పంటలు అమ్మ దలచిన రైతులు రైతు భరోసా కేంద్రాల ద్వారా అమ్ముకోవటానికి తగిన ఏర్పాట్లు చేశామన్నారు.
ఎక్కువ ధాన్యం నిల్వ చేసుకోవటానికి గొడౌన్స్ ఏర్పాటు చేశామన్నారు. రైతులు దళారుల చేతిలో మోసపోకుండ వారి ధాన్యాన్ని రైతు భరోసా కేoద్రాల ద్వారా అమ్ముకోవాలని, రైతులందరు రైతు భరోసా కేంద్రాలను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర భూ సర్వే మొదటి విడతగా జిల్లాలో 400 గ్రామాలలో సర్వే జరుగుతుందన్నారు. భూ సమస్యలన్నింటిని పరిష్కరించటానికి చెర్యలు తీసుకుంటున్నామని రైతాంగం వారి భూములను సర్వే చేయించుకోవాలన్నారు . రైతులకు ఏ విధమైన ఇబ్బంది జరిగిన ప్రభుత్వమే పరిహారం చెల్లిస్తుందన్నారు. రైతులకు సబ్సీడీ పై విత్తనాలు ఇవ్వటం జరిగిందని, వేలి ముద్ర పడకపోతే వి. ఏ . వొలు వేలి ముద్ర వేసి రైతులకు విత్తనాలు అందిస్తారన్నారు .
ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డు చైర్మన్ శ్రీ నిరంజన్ బాబు రెడ్డి , వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు ఆనంద కుమారి , ఎం పి డీవొ . శ్రీ హరి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు .