మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం..


Ens Balu
2
Tirupati
2020-12-18 22:52:55

మహిళ చేతిలో డబ్బు, అధికారం వుంటే  మహిళా సాధికారిత  సాధించగలరనే అభిప్రాయం తో  రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి గారు  పథకాలను  మహిళలకే ప్రాధాన్యత నిస్తున్నారని రాష్ట్ర మహిళా కమిషన్  చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు.  శుక్రవారం  మధ్యాహ్నం గ్రామానికి చేరుకున్న ఆర్. సి పురం మండలం, సి. రామాపురం గ్రామంలో  చైర్ పర్సన్ కు చిత్తూరు ఆర్డీఓ రేణుక,  చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, స్థానిక నాయకులు, మహిళలు, ఘన స్వాగతం పలుకగా ధర్మరాజుల గుడి ఆలయ అర్చకులు ఆలయమర్యాదలతో ఆహ్వానం పలికారు.   గుడి  వద్ద ఏర్పాటు చేసిన  మహిళా మార్చ్ 100 రోజుల కార్యక్రమంలో చైర్ పర్సన్  ముఖ్య అతిధిగా పాల్గొనగా  మండల అభివృద్ది అధికారి అధ్యక్షత  వహించగా  చెవిరెడ్డి మోహిత్ రెడ్డి విశిష్ట అతిధిగా పాల్గొన్నారు.                ఐ.సి.డి.ఎస్. ఏర్పాటు  చేసిన  స్టాల్స్ సందర్శించి  బాలల అన్న ప్రాసన కార్యక్రమం, గర్భిణీల  శ్రీమంతం కార్యక్రమం లో పాల్గొని,  అనంతరం  జ్యోతిని వెలిగించి  మహిళామణులతో ముఖాముఖీ కార్యక్రమం సాగించారు.  చైర్ పర్సన్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆడపిల్లలు పుట్టినప్పటి నుండి  వాళ్ళకు ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారని  మహిళల కోసం అమలు చేస్తున్న పథకాలు  మరింత పటిష్టంగా  అమలు  కావడానికి  నేడు మహిళా లబ్దిదారులతో ముఖాముఖి  ఏర్పాటు చేసి  మీతో  స్వయంగా  పాలు పంచుకునే అదృష్టం కలిగిందని  అన్నారు.   మహిళలకు కష్టపడే మనస్తత్వం, కుటుంబం,  సమాజం  కోసం పాటు  పడతారని అందుకే అమ్మ ఒడి  పథకం నుండి   ఇంటి పట్టాలు , ఇల్లు  నిర్మాణాల   వరకు మహిళలకే అమలు చేస్తున్నారన్నారు.   వార్డు/ గ్రామ సచివాలయాలతో  పరిపాలన  మీ గ్రామనికే  వచ్చిందని, మహిళా రక్షణ   కార్యదర్శి మీకు అందుబాటులో  వున్నారని, ప్రతి గ్రామాన్ని  ఆదర్శ గ్రామంగా తీర్చి దిద్దాలని ఆశిస్తున్నానని  తెలిపారు.  మార్చి 8 న అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఒక్క జరుపుకుని ఆ తరువాత సాధికారిత మర్చిపోతున్నారని, అందుకే ముఖ్యమంత్రి మహిళా మార్చ్ - 100 రోజులు అవగాహనా కార్యక్రమాల ఏర్పాటుతో 2021 మార్చి 8 నాటికి పూర్తి అయ్యేలా నిర్వహణ జరపాలనే  ఆదేశాల మేరకు కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. బాల్యవివాహాలకు స్వస్థి పలకాలని కోరారు. దిశ 112, నిర్బయ 9833312222 ఫోన్ నెంబర్లతో పాటు ఈ  చట్టాల మీద మహిళలు చైతన్యవంతులు కావాలని కోరారు.             చిత్తూరు  ఆర్ డి ఓ  రేణుకా మాట్లాడుతూ బాల్య వివాహాలు తల్లిదండ్రులు  ప్రోత్సహించరాదని,  ప్రభుత్వ పథకాలు అర్హులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.  ముఖాముఖీ కార్యాక్రమంలో  మహిళలు  ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి గారిని,  స్థానిక శాసన సభ్యులు  చెవిరెడ్డి భాస్కర్  రెడ్డి ని కరోనా కష్ట కాలం లో ఆదుకున్న  దేవుళ్లుగా   అభివర్ణించారు.  జగనన్న తోడు,  అమ్మ ఒడి, విద్యా దీవెన , రేషన్ కార్డు,   ఆరోగ్య శ్రీ  లబ్దిదారులు లబ్ది పొందిన విధానం ,  సచివాలయాల వల్ల  ఇంటి వద్దకే  పథకాలు  అందడం వంటివి  వివరించారు.   జగనన్న తోడు  లబ్దిదారులకు  రూ. 49.90 వేల చెక్కును చైర్ పర్సన్ చేతుల మీదుగా అందజేశారు.            సమావేశానంతరం మహిళలు మానవ హారంగా ఏర్పడి  మహిళల  సాధికారతకు  నినాదాలు చేశారు.         ఈ కార్యక్రమంలో  ఎం పి డి ఓ    రాజశేఖర్ రెడ్డి ,  తహసిల్దార్ మధుసూధన రావు, డైరెక్టర్  సూయజ్,  పి డి ఉమా మహేశ్వరి ,  సి డి పి ఓ పద్మజ, స్థానిక నాయకులు భాను, మోహన్,  ఢిల్లీ రాణి,  దామోదర్ రెడ్డి,  బ్రహ్మానంద రెడ్డి , యశోధ,  చంద్ర శేఖర్  తదితరులు పాల్గొన్నారు.