నెలాఖరు నాటికి డేటా సేకరణ పూర్తికావాలి..
Ens Balu
4
Vizianagaram
2020-12-18 22:55:57
భూ గర్భ జలాలను అంచనా వేయడం ద్వారా నీటిని (రెగ్యులేట్) స్తిరీకరింప జేయడానికి అవకాశం లభిస్తుందని సంయుక్త కలెక్టర్(ఆసరా) జే. వెంకట రావు తెలిపారు. నీరు పునరుత్పాతక వనరు అయినప్పటికీ పరిమితంగా వినియోగించడం వల్లనే భవిష్యత్తు లో నీటి కొరత నుండి బయట పడగలమని అన్నారు. శుక్రవారం భూ గర్భ జల వనరుల అంచనాల జిల్లా స్థాయి కమిటీ మొట్టమొదటి సమావేశం కల్లెక్టరేట్ సమావేశ మందిరం లో జే.సి ఆధ్వర్యం లో జరిగింది. ఈ సమావేశం లో భూ గర్భ జల శాఖ ఉప సంచాలకులు శాస్త్రి పవర్ పాయింట్ ద్వారా కమిటి వివరాలను, నీటి పరిరక్షణ, నిర్వహణ , జిల్లాలోని భూ గర్భ జలాల పరిస్థితిని వివరించారు.
భూ గర్భ జలాలను అంచనా వేయడం వలన ప్రభుత్వ పధకాలైన వై.ఎస్.ఆర్ జల కళ, ఉపాధి హామీ పధకం తో చేపడుతున్న కార్యక్రమాలకు, భారీ నీటి పారుదల ప్రాజెక్టులకు, ప్రపంచ బ్యాంకు ద్వారా చేపడుతున్న జలవనరుల ప్రాజెక్టులకు , ఎ.పి వాల్టా చట్టాన్ని రెగ్యులేట్ చేయడానికి ఉపయోగపడుతుందని అన్నారు. మూడేళ్ళకోసారి జరిగే ఈ అంచనాలకోసం 100 మీటర్ల నుండి 300 మీటర్ల లోతు వరకు అధ్యనం చేస్తారని, నీటి లోనున్న ఆర్సెనిక్, ఫ్లోరైడ్ ,ఆమ్లాల శాతాన్ని కూడా పరిశీలించడం జరుగుతుందని అన్నారు. వర్షపాతం, కాలవలు, చెరువులు, జలాశయాలు, , ఇరిగేషన్, తదితర అన్ని రకాల సోర్స్ ద్వారా వచ్చే ఇన్ఫ్లో, అవుట్ ఫ్లో ,స్టోరేజ్ స్థాయిలను అంచనాలు వేయడం జరుగుతుందన్నారు. గ్రామ స్థాయి నుండి జరిగే ఈ అంచనాల కార్యక్రమానికి వర్షపాతం , బావుల సంఖ్య, ప్రజా , పరిశ్రమల వినియోగానికి అవుతున్న నీటి వివరాలను చీఫ్ ప్లానింగ్ అధికారి, తహసిల్దార్లు, విద్యుత్ అధికారులు అందజేయలన్నారు. కాల్వల ద్వారా రీ చార్జ్ అయ్యే నీరు, వ్యవసాయానికి వినియోగించే నీటి వివరాలను జల వనరుల శాఖ అందజేయలన్నారు. నీటి పరిరక్షణ (కన్సర్వేషన్) వలన రీచార్జ్ అయ్యే నీటి వివరాలను గ్రామీణ నీటి సరఫరా, గ్రామీణాభివృద్ధి , మున్సిపల్ శాఖలు అందజేయలన్నారు. ఈ అంచనాలను మదింపు చేసిన తర్వాత భవిష్యత్ లో ప్రజలకు, పరిశ్రమలకు అవసరమయ్యే నీటి ని అంచనా వేయడానికి 2011 జనాభా వివరాలను అందజేయాలని చీఫ్ ప్లానింగ్ అధికారికి సూచించారు. ఈ డేటా సేకరణ ఈ నెల 31 నాటికీ పూర్తి చేయాలనీ, జనవరి 25 లోపల వెరిఫికేషన్ పూర్తిచేసి రాష్ట్ర స్థాయి కమిటీ కి జనవరి 31 కి చేరేలా పంప వలసి ఉందని అన్నారు.
ఈ సమావేశం లో డుమా ప్రాజెక్ట్ డైరెక్టర్ నాగేశ్వర రావు, మున్సిపల్ కమీషనర్ వర్మ, అటవీ, వ్యవసాయ, ఉద్యాన, నీటి పారుదల, తదితర శాఖల అధికారులు హాజరైనారు.