అర్హులకు పరిశ్రమ ప్రోత్సాహకాలు అందించాలి..


Ens Balu
2
Srikakulam
2020-12-19 18:52:40

పరిశ్రమల ప్రోత్సాహకాలు అర్హులకు ఖచ్చితంగా అందించాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు.. శనివారం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా కలెక్టర్ అధ్యక్షత న జిల్లా పరిశ్రమలు,ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్హులకు పరిశ్రమల ప్రోత్సాహకాలు అందించేలా కమిటీ సభ్యులు క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు..   చేనేత పరిశ్రమను రక్షించేందుకు ధర్మవరం పరిసర ప్రాంతాల్లో పవర్లూమ్ యూనిట్ల స్థాపన కు అనుమతి ఇవ్వకూడదని కలెక్టర్ తెలిపారు.. జిల్లాలోని ఉత్పత్తుల ఎగుమతులకు ప్రోత్సహించేందుకు తగిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాల్సిందిగా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.  జిల్లాలో మాత్రమే ప్రత్యేకంగా ఉన్న  నిమ్మలకుంట తోలుబొమ్మలు, ఓళిగ లు, నన్నారి, మేక  పాలు తదితర ఉత్పత్తుల ను ఎగుమతి చేసేందుకు గల అవకాశాలను పరిశీలించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఎస్సీ,ఎస్టీ పరిశ్రమల పాలసీ కి సంబంధించిన వైఎస్సార్-జగనన్న బడుగు వికాసం 2020-23 పథకంపై సంబంధించిన లబ్ధిదారులకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో ప్రస్తుతం ఉన్న పరిశ్రమల స్థితిగతుల గురించిన సమగ్ర సర్వే ను 15 రోజుల్లోపు పూర్తి చేయాలన్నారు. స్టాండప్ ఇండియా పథకం కి సంబంధించి నిర్దేశిత లక్ష్యాలను ఎల్డీఎం, బ్యాంకర్లు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.. 5.37 కోట్ల రూపాయల సబ్సిడీ మంజూరుకు ఆమోదం 141 క్లెయిమ్స్ కు గాను ప్రోత్సాహకంగా  రూ.5.37 కోట్ల రూపాయల ఇన్సెంటివ్ మొత్తం అందించేందుకు  కమిటీ ఆమోదం తెలిపింది..44 క్లెయిమ్స్ కు సంబంధించి సరైన ధ్రువ పత్రాలు సమర్పించకపోవడంతో తిరస్కరించారు.. సమావేశంలో పరిశ్రమల శాఖ జీఎం సుదర్శన్ బాబు,బ్యూరో ఆఫ్ స్టాండర్డ్స్ డిడి రాహుల్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు..