విశాఖలో సేంద్రియ చర్మ రక్షణ ఉత్పత్తులు..
Ens Balu
2
Visakhapatnam
2020-12-19 19:07:57
విశాఖలో మొదటిసారిగా అందరికీ అందుబాటులో సేంద్రీయ స్కిన్ కేర్ ఉత్పత్తులను అందచేయడం ఆహ్వానించదగ్గదని విశాఖ దక్షిణ శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. శనివారం నగరంలోని రాంనగర్ లో నూతనంగా ఏర్పాటుచేసిన సోఫియా స్కిన్ లేయర్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, త్వరలో వ్యాపారాభివృద్ధి సాధించి అభివృద్ధిలోకి రావాలని ఆకాంక్షించారు. నిజాయతీతో వ్యాపారంచేసి వినియోగదారులను ఆకట్టుకోవాలని వాసుపల్లి సూచించారు. సంస్థ నిర్వహాకులు సోఫియా సుని మాట్లాడుతూ, విశాఖలో మొదటిసారిగా సీరం ఉత్పత్తులు అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. మధ్య తరగతి వర్గాలకు కూడా అందుబాటులో ఉండే విధంగా తమ ఉత్పత్తులు ఉంటాయన్నారు. స్కిన్ కేర్,హెయిర్ కేర్ బాడీ కేర్ ఉత్పత్తులు పూర్తి సేంద్రీయ ఉత్పత్తులని వివరించారు. వాసుపల్లికి పుష్పగుచ్ఛమిచ్చి ఆహ్వానించిన సంస్థ యాజమాన్యం శాలువాతో సత్కరించి కృతఙ్ఞతలు తెలిపారు. డాక్టర్ శాంతకుమారి,వినీ,కృపామణి,జోసెఫ్,జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.