యుపిఎస్సీ పరీక్షకు 1452 మంది..


Ens Balu
4
తిరుపతి
2020-12-19 19:27:52

యూనియన్ పబ్లిక్  సర్వీస్  కమీషన్ ద్వారా ఈనెల 20న  నిర్వహించనున్న సెంట్రల్ అర్మడ్ పోలీసు  ఫోర్స్(అసిస్టెంట్  కమాండెంట్ )  పరీక్ష – 2020 కు 1452 అభ్యర్థులు హాజరు కానున్నారని  యు.పి.పి.ఎస్.సి. పర్యవేక్షణ అధికారి ఎ.కె మిశ్రా  తెలిపారు. శనివారం  స్థానిక  ఆర్ డి ఓ కార్యాలయం లో  సి ఎ పి ఎఫ్ నిర్వహణ పై  పరీక్షల  నిర్వహణ  లైజన్ అధికారులు,   ఇన్స్ పెక్టింగ్   అధికారులతో తిరుపతి ఆర్ డి ఓ కనకనరసారెడ్డి  , యు పి పి ఎస్ సి అధికారి మిశ్రా పలు సూచనలు చేశారు.  ఈ సందర్భంగా సమీక్షిస్తూ కోవిడ్  నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహణ జరగాలని, ఈ  పరీక్షలు  రెండు  సెషన్స్ లో ఉదయం 10 నుండి 12 వరకు , మధ్యాహ్నం   2 నుండి 5 గంటల వరకు  జరుగుతుందని  మొత్తం  అభ్యర్థులు 1452 మంది  అభ్యర్థులు 5 సెంటర్లలో  పరీక్షలు వ్రాయ నున్నారని తెలిపారు.  పరీక్షా సమయంలో విద్యుత్ అంతరాయం లేకుండా , సెంటర్ల వద్ద అవసరమైన పోలీస్ భద్రత, కోవిడ్ నిబంధనలు పాటించేలా సంబంధిత శాఖలు వ్యవహరించాలని సూచించారు. ఈ సమీక్షలో జిల్లా అధికారులు, లైజన్ ఆఫీసర్లు , రూట్ ఆఫీసర్లు పాల్గొన్నారు. అభ్యర్థులు పరీక్ష సమయానికి గంటముందే చేరుకోవాలని 10 నిముషాల ముందుగా మైన్ గేట్లు మూసివేయడం జరుగుతుందని తెలిపారు. పరీక్షా కేంద్రాలు – అభ్యర్థులు (1) శ్రీపద్మావతి ఉమెన్స్ జూనియర్ కళాశాల వింగ్ – ఎ నందు  :384 మంది అభ్యర్థులు ,(2) వింగ్ బి లో -288 మంది , (3)శ్రీపద్మావతి ఉమెన్స్ డిగ్రీ కళాశాల వింగ్ - బి నందు : 288 మంది ,(4) శ్రీపద్మావతి గర్ల్స్ హైస్కూల్ (బాలాజీకాలని ఎదురుగా) 288 మంది, (5) ఎ.వి.యూనివర్సిటీ కాంపస్ స్కూల్ లో 204 మంది అభ్యర్థులు ఈ సి.ఎ.పి.ఎఫ్.(అసిస్టెంట్ కమాండెంట్) పరీక్షలు -2020 కు హాజరు కానున్నారు.