పర్యాటక ప్రారంతంగా మరింత అభివ్రుద్ధి..
Ens Balu
4
కర్నూలు
2020-12-19 19:34:17
కర్నూలు నగరంతోపాటు శివారు ప్రాంతాలను పర్యటకంగా అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తున్నట్లు కర్నూలు ఎమ్మెల్యే ఎం.ఏ. హాఫిజ్ ఖాన్ పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, నగర నడిబొడ్డున చరిత్రాత్మక కేసి కెనాల్ వినాయక్ ఘాట్ నుంచి జోహారాపురం వరకు బోటు షికారును ఏర్పాటు చేయడానికి ఇప్పటికే కర్నూలు నగర పాలక సంస్థ అధికారులు సన్నాహాలు ప్రారంభించారన్నారు. వాటర్ రెసింగ్ వంటి పోటీలు పెట్టి ఇంకా అభివృద్ధి పరచవొచ్చన్న ఆయన వెంటనే జిల్లా అధికారులు నాకన్నా ముందుగానే ఆలోచన అమలు చేసేవిధంగా ట్రయిల్ రన్ చేయడం జరిగిందన్నారు. అభివృద్ధి కోసం పర్యటక శాఖ సదుపాయలు ప్రణాళికలను రూపొందించిందన్నారు. ఈ మేరకు గత వారం జిల్లా కలెక్టర్ వీరపాండియన్, నగర పాలక కమిషనర్ డి.కె.బాలాజీ, జిల్లా జలవనరుల శాఖ సీఈ మురళినాథ్ రెడ్డి గారు బోటింగ్ విహారానికి ట్రయల్ రన్ చేశారని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో మరోసారి వినాయక ఘాట్ వద్ద కర్నూలు, పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఎం.ఏ.హాఫిజ్ ఖాన్, కాటసాని రాంభూపాల్ రెడ్డి , నగర పాలక డిఈ రాజశేఖర్ లు వినాయక ఘాట్ నుంచి జోహారాపురం వరకు బోటింగ్ లో ప్రయాణించి నిర్వహణ సాధ్యాసాధ్యాలను పరిశీలించారు. నగర ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం లో ఇలాంటి బోటింగ్ విహారం ఏర్పాటు చేయడం మంచి పరిణామం అని వ్యాఖ్యానించారు.