పోషణ పథకం పక్కాగా అమలు జరగాలి..
Ens Balu
2
Srikakulam
2020-12-19 19:49:51
మహిళలు, పిల్లల ఆరోగ్య పరిరక్షణ కోసం సంపూర్ణ పోషణ పథకం సద్వినియోగం అయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ పేర్కొన్నారు. శనివారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఐసీడీఎ స్ సి డి పి ఓ లు, సూపర్ వైజర్లతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సంపూర్ణ పోషణ పధకం కార్యక్రమం జిల్లాలో 19 మండలాల్లో అమలు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ అన్నారు. ఇది బృహత్తర కార్యక్రమం అని, జిల్లాకు ఇది ఒక వరమని అన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలు, గర్భిణీ ల కు పోషకహారం అందచేయడంలో అలసత్వం వహించ రాదన్నారు. పథకాన్ని పక్కాగా అమలు చేయాలన్నారు. ఎగ్స్, బియ్యం, రేషన్ నాణ్యతతో కూడినవే వుండాలన్నారు. 2021సం.లో మహిళలు, పిల్లలు ఆరోగ్యంగా ఉండాలన్నారు. మహిళలకు రక్త హీనత వుండరాదన్నారు. తక్కువ బరువున్న పిల్లలు పుట్టే పరిస్థితి వుండరాదన్నారు. సంపూర్ణ పోషణ పథకం ద్వారా అందరూ ఆరోగ్యకరంగా వుండాలని, అంగన్వాడీ కేంద్రాలు బాగా పని చేయాలని తెలిపారు. పధకాన్ని సక్రమంగా అమలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ కె.శ్రీనివాసులు, జిల్లా గ్రామీణ అభివృధ్ధి సంస్థ పథక సంచాలకులు బి.శాంతిశ్రీ, ఐసీడీస్ పీడీ జయ దేవి, సి డి పి ఓ. లు, సూపర్ వైజర్లు తదితరులు హాజరయ్యారు.