మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం..


Ens Balu
3
Srikakulam
2020-12-19 19:54:00

మహిళా సాధికారిత సాధన దిశగా ముఖ్యమంత్రి చర్యలు చేపడుతున్నారని లెజిస్లేటివ్ అసెంబ్లీ కమిటీ చైర్మన్ మరియు పాలకొండ శాసన సభ్యులు విశ్వాసరాయి కళావతి పేర్కొన్నారు.  శనివారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మహిళలు, బాలికల సాధికారత -భద్రత, రక్షణపై  అవగాహనా సదస్సు, మహిళా మార్చ్ @100 రోజులు కార్యక్రమం జిల్లా కలెక్టర్ జె. నివాస్ అధ్యక్షతన జరిగింది.  కార్యక్రమానికి చైర్మన్ విశ్వాసరాయి కళావతి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,  మహిళల సాధికారతకు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి  పాలనలో భగస్వామ్యం కావడం అదృష్టం అన్నారు. సి ఎం లక్ష్యాలు నెరవేర్చడానికి కలసి కట్టుగా పని చేయాలన్నారు.  దేశానికే ఆదర్శంగా దిశ చట్టాన్ని ప్రవేశ పెట్టారని తెలిపారు.  లైంగిక హింసకు గురైన మహిళలకు, బాలికలకు అత్యవసర సేవలను అందించు నిమిత్తం యాప్ లను రూపొందించడం జరిగిందని తెలిపారు.  మహిళా ఉద్యోగుల కోసం సఖి యాప్ ను,  ఆటోలలో ప్రయాణ రక్షణ కోసం అభయ యాప్ ను, రూపొందించడం జరిగిందని తెలిపారు.   అదే విధంగా అత్యవసర సమయంలో టోల్ ఫ్రీ నెంబర్లు, పోలీసు – 100, చైల్డ్ లైన్ కోసం 1098, మహిళా హెల్ప్ లైన్ వన్ స్టాప్ సెంటర్ కోసం 181 నెంబరు, విదేశీ వ్యవహారాల ఫిర్యాదులు 18001022426 నెంబర్లకు ఫోన్ చేసి న్యాయం పొందే అవకాశాలు కల్పించడం జరిగిందని తెలిపారు.  మహిళలు మరియు బాలికల రక్షణ కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను మారు మూల  ప్రాంతాల ప్రజలకు తెలియపరచవలసిన ఆవశ్యకత వుందన్నారు.  ఈ వంద రోజుల మహిళా మార్చ్ కార్యక్రమం ద్వారా ప్రతీ ఒక్కరికీ అవగాహన కలిగించడం ముదావహమన్నారు.  ట్రైబల్ ప్రాంతాల్లో సైతం మహిళల ఇబ్బందులు తొలగించి వారికీ న్యాయం చేయాలని, కార్యాలయాలలో వివక్ష తొలగాలని. గ్రామ/వార్డు సచివాలయాలలో మహిళల సమస్యలను తొలగించే చర్యలు చేపట్టడం ద్వారా ముఖ్యమంత్రి ఆశయాలు నెరవేరుతాయన్నారు.                        జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మెహన్ రెడ్డి మహిళా సంక్షేమానికి పెద్ద పీట వేశారని తెలిపారు. ముఖ్య మంత్రి స్వయంగా కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారని,  డిసెంబర్ 14 నుంచి మార్చి  8  వరకు వంద రోజుల నిర్వహణపై దిశ నిర్దేశం చేసారని తెలిపారు. విధుల నిర్వహణలో మహిళలు అత్యంత సమర్ధులని అన్నారు. ఆశా, ఎ ఎన్ ఎం., అంగన్వాడీ, స్టాఫ్ నర్స్ లు, డాక్టర్స్, వాలంటీర్స్, కరోనా నిరోధానికి అత్యంత కృషి చేసారని తెలిపారు. 70 శాతం మహిళలు మంచి సేవలను అందించడం పట్ల కలెక్టర్ ప్రశంసించారు.   సి ఎం. గ్రామాలలో సైతం మహిళ రక్షణ కోసం మహిళా పోలీసులను  నియమించినట్లు చెప్పారు. వంద రోజుల కార్యక్రమం ద్వారా మహిళల హక్కులు, భద్రత, చట్టాలపై  ల పై మహిళలకు అవగాహన కలిగించాలని అన్నారు. మగవారు, ,గ్రామ పెద్దలు కూడా పాల్గొనాలని అన్నారు.  పోలీసులను సమన్వయ పరచుకుని మండల స్థాయి,  గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమం నిర్వహించాలన్నారు.  పాత పట్నం ఎం ఎల్ ఎ రెడ్డి శాంతి మాట్లాడుతూ, మహిళల పట్ల గౌరవం, మహిళలను పూజించే తత్వం మన సి. ఎం. కి వున్నాయన్నారు. మహిళా సాధికారిత, హక్కుల కల్పన పై ముఖ్యమంత్రి అను నిత్యం శ్రామిస్తున్నారన్నారు. దిశ చట్టం, అమ్మ ఒడి, మహిళలకు సి ఎం ఇచ్చిన ధైర్యం అన్నారు. 30 లక్షల ఇళ్ల పట్టాలు మహిళల పేరు మీదుగా ఇవ్వడం హర్హణీయమన్నారు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభమైంది. మహళా మార్చ్, దిశ చట్టం ఫాంప్లెట్లను విడుదల చేసారు.               ఈ  కార్యక్రమంలో  జె సి  కె.శ్రీనివాసులు, రాజాం ఎం ఎల్ ఎ  కంబాల జోగులు, డి ఎస్ పి మహేంద్ర, డి ఆర్ డి ఎ పి డి శాంతి శ్రీ, ఐ సి డి ఎస్   పి డి.జయదేవి,డి సి పి ఓ. రమణ, చైల్డ్ వెల్ఫేర్ సభ్యులు జ్యోతి, సత్యవాణి, తదితరులు పాల్గొన్నారు.