విశాఖజిల్లాలో కరోనాను సమర్ధవంతంగా ఎదుర్కొంటాం..


Ens Balu
4
2020-08-08 22:18:41

విశాఖ నగరంతోపాటు జిల్లాలోనూ కోవిడ్ తీవ్రత ను అరికట్టేం దుకు జిల్లాలో డాక్టర్లు, వైద్య సిబ్బంది, మందులు, మెటీరియల్ అన్నీ సిద్ధంగా ఉన్నాయని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు చెప్పారు. శనివారం విశాఖ ఉడా చిల్జ్రన్స్ థియేటర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లా లో నిన్నటి వరకు 17,488 పాజిటివ్ కేసులను గుర్తించారని, అందులో 8287 మంది ని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ చేసారని, 121 మరణాలు సంభవించాయని తెలిపారు. మొత్తం 1,83,394 పరీక్షలు నిర్వహించామన్న మంత్రి ఇప్పటి వరకూ 9080 మంది రోగులు చికిత్స పొందుతున్నారని, అందులో 302 మంది ఐసీయూలో ఉన్నారని, 926 మంది ఆక్సిజన్ బెడ్ లలో చికిత్స పొందుతు న్నార ని తెలిపారు. ఇంకా 3010 మంది హోం ఐసోలేషన్ లో, 3296 మంది కోవిడ్ కేర్ సెంటర్ లలో, 2748 మంది కోవిడ్ ఆసు పత్రులలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. హోం క్వారంటైన్ లో 15042 మంది ఉన్నారని తెలిపారు.134 వెరీ యాక్టివ్ క్లస్టర్ లు, 279 యాక్టివ్ క్లస్టర్ లు ఉన్నాయని తెలిపారు. ప్రజలు గుంపు లు గా తిరగరాదని, స్వచ్ఛందంగా నియంత్రణ పాటించాలని కోరారు. కెజిహెచ్ కొత్త బ్లాక్ త్వరలో అందుబాటులోకి రానుందని తెలిపారు. జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ మాట్లాడుతూ జూనియర్ డాక్టర్లు, పీజీ ల స్టయిఫండ్ చెల్లింపు లు త్వరలో జరుగుతాయని తెలిపారు. నగరంలో అదనంగా 42 పిహెచ్ సి లు ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. 54 పాత అంబులెన్స్ లకు మరమ్మతులు చేయిస్తున్నారని తెలిపారు. కోవిడ్ బారిన పడిన జర్నలిస్టుల కు వైద్య సేవలు అందించేందుకు గీతం ఆసుపత్రిలో ప్రత్యేకంగా 20 బెడ్ లను కేటాయించారని తెలిపారు. ఈ సమావేశంలో పార్లమెంట్ సభ్యులు డాక్టర్ బి.వి.సత్యవతి, శాసన సభ్యులు తిప్పల నాగిరెడ్డి, కరణం ధర్మశ్రీ, ఏ. అదీప్ రాజ్, జాయింట్ కలెక్టర్ అరుణ్ బాబు, జీవీఎంసీ కమీషనర్ జి.సృజన, డిసిపి ఐశ్వర్య రస్తోగి, రూరల్ ఎస్పీ కృష్ణా రావు,ఇతర అధికారులు పాల్గొన్నారు.