ఘనంగా ద్రోణంరాజు సత్యనారాయణ జయంతి..
Ens Balu
3
Visakhapatnam
2020-12-19 20:21:17
ద్రోణంరాజు సత్యనారాయణ 88వ జయంతి వేడుకలను ఆయన మనవడు ద్రోణంరాజు శ్రీవాస్తవ్ ఆధ్వర్యంలో వీఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరినాలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వైఎస్సార్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ వి.విజయసాయిరెడ్డి జ్యోతి. ప్రజ్వలన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తాత, తండ్రిలాగే శ్రీవాస్తవ్ లో కూడా ప్రజలకు సేవచేసే గుణం కనిపిస్తుందన్నారు. ఈ సందర్భ ద్రోణంరాజు సత్యనారాయణ, ద్రోణం రాజు శ్రీనివాస్ సేవలను కొనియాడా ఈ కార్యక్రమంలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్యేలు అమర్నాథ్, ధర్మశ్రీ గొల్లబాబురావు, నాగిరెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు కోలాగురువులు, వంశీకృష్ణ శ్రీనివాస్, సినీ రచయిత కోనా వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
ద్రోణంరాజు సత్యనారాయణ జయంతి సందర్భంగా సిరిపురం కూడలిలో వున్న ఆయన విగ్రహానికి మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, సినీ రచయిత కోనా వెంకట్ తదితరులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.