అభివ్రుద్ధి ప్రధాన అజెండగా పాలకవర్గ సమావేశం..


Ens Balu
5
Kakinada
2020-12-19 20:24:14

కాకినాడ నగరపాలక సంస్ధ పాలక మండలి సర్వసభ్య సాధారణ సమావేశం శనివారం విక్టోరియా వటర్ వర్క్స్ లోని స్మార్ట్ సిటీ సమావేశ మందిరంలో మేయర్ సుంకర పావని తిరుమల కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి కాకినాడ పార్లమెంటు సభ్యురాలు వంగా గీత, సిటీ శాసన సభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి , నగర పాలక సంస్ధ కమీషనర్ స్వర్నిల్ దిన్కర్ పుడ్కర్ తదితరులు హాజరయ్యారు. కోవిడ్ 19 వంటి క్లిస్ష పరిస్ధితులు ఉన్నప్పటికీ ప్రజాప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని పాలక మండలి సర్వ సభ్య సమావేశాన్ని నిర్వహించినట్లు మేయర్ పావని తిరుమల కుమార్ తెలిపారు. ప్రజల సమస్యలకు తక్షణ పరిష్కారం చూపేందుకు ప్రాధాన్యం ఇచ్చినట్లు ఆమె తెలిపారు. తొలుత ఇటీవల కోవిడ్-19 కారణంగా మరణించిన నలుగురు మాజీ కౌన్సిల్ సభ్యులైన రాగిరెడ్డి వెంకట జయరామ్ కుమార్(ఫ్రూటీ కుమార్), ఇంటి సత్యన్నారాయణ, బంగారు ప్రకాష్, మోసా కాలమ్మలకు సభ్యులు నివాణులర్పించి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గతంలో నగరపాలక సంస్ధ ఉన్నతికివారు చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ, వారి మృతికి సంసతాప సూచసంగా సభ్యులదరూ 2 ని. మౌనం పాటించి వారితో గల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.  అందరికీ మంచి చేయాలనే ప్రజా సేవకుడు-ఎంపి వంగా గీత రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజా సమస్యల పరిష్కారానికు నిరంతరం పాటు పడిన గొప్ప నాయకుడు రాగిరెడ్డి వెంకట జయరామ్ కుమార్ అని ఎంపి తెలిపారు. మాజీ కౌన్సిల్ సభ్యులుగా ఎనలేని సేవలు అందించారని, వారి కుటుంబానికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని ఆమె తెలిపారు.  రాగిరెడ్డి జయరామ్ కుమార్ మృతి నగర వాసులకు తీరని లోటు –ఎంఎల్ఏ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. గత 20 సంవత్సరాలుగా ప్రజా సేవకే అంకితమైన గొప్ప వ్యక్తి జయరామ్ కుమార్ అని ఎంఎల్ఏ అన్నారు. కాకినాడ నగర పాలక సంస్ధ కౌన్సిలర్ గా (2005-2009) జిల్లా ప్లానింగ్ కమీషన్ మెంబర్ గా , మున్సిపల్ కౌన్సిల్ నందు విప్ గా , స్టాండింగ్ కౌన్సిల్ 3వ సర్కిల్ నందు ఛైర్మన్ గా పదవులు చేపట్టి ఎనలేని సేవలందించారన్నారు. చిన్న వయస్సులోనే మృతి చెందడం కాకినాడ ప్రజలకు దిగ్భ్రాంతికి గురిచేసిందని ఎంఎల్ఏ తెలిపారు.  18 అంశాలపై చర్చః- పాలక మండలి సర్వ సభ్య సమావేశంలో 5 అంశాలతో కూడిన ప్రధాన అజెండా 13అంశాలతో కూడిన సప్లిమెంటీ అజెండా నగర పాలక సంస్ధ కార్యదర్శి డి.లక్ష్మీ సభ ముందుంచారు. అజెండా అంశము 4 లోని 40వ డివిజన్ పరిధిలో గల వివేకానంద పార్క్ నందు నూతనంగా నిర్మించిన సైన్స్ సెంటర్ భవనం నకు మల్లిపూడి శ్రీరామ సంజీవరావు సెంటర్ ఫర్ సైన్స్ గాను, 5వ అంశాలోని రాజా ట్యాంక్ నందు  నూతనంగా నిర్మిస్తున్నటువంటి గోదావరి కళాక్షేత్రం భవనమునకు రాగిరెడ్డి వెంకట జయరామ్ కుమార్ కళాక్షేత్రంగాను, 11వ అంశములోని 6వ డివిజన్ పరిధిలోని నూకాలమ్మా మాన్యంకాలనీకి బండి ఆంజనేయులు ఎస్.టి.ఎరుకల కాలనీగాను ,12వ అంశంలోని 24వ డివిజన్ పరిధిలోగల మేక నారాయణమ్మ తోట నందు కామన్ సైట్ లో గల పార్కుకు మీసాల కోట మావుళ్ళయ్య పార్క్ గాను, 18వ అంశంలోని10వ డివిజన్ పరిధిలో ఉన్న దుమ్ముల పేట పార్క్ నకు మాజీ కార్పొరేటర్లు ఏరుపిల్లి చిన్నయ్య పార్కుగాను, ఫిష్ మార్కెట్ కు మైలపిల్లి తాతారావు ఫిష్ మార్కెట్ గాను నామకరణం చేస్తూ కౌన్సిల్ సభ్యులు చేసిన తీర్మానాన్ని సభ ఆమోదించింది.  నగరంలోని జంక్షన్లు అభివృధ్ధికి చర్యలు  నగర పాలక సంస్ధ 50 వార్డుల పరిధిలో ఉన్నటువంటి జంక్షన్ లను అభివృధ్ధి చేయడం జరుగుతుందని కమీషనర్ స్వప్నిల్ ది న్కర్ పుడ్కర్ తెలిపారు. అజెండాలోని 7 వ విషయంలో తెలిపిన 47 జంక్షన్ లు మాత్రమే కాకుండా భవిష్యత్తులో ఏమైనా జంక్షన్లు గుర్తించిన ఎడల వాటీని కూడా కాకినాడ నగర సుందరీ కరణలో భాగంగా అభివృధ్ధి చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. అజెండాలోని 14వ విషయం చర్చలో భాగంగా స్వఛ్ఛ సర్వేక్షణ్ లో భాగంగా నగర పాలక సంస్ధ పరిధిలో గల కమ్యూనిటీ టాయిలెట్స్, పబ్లిక్ టాయిలెట్స్ మొత్తం 41కి గాను, 12 పే అండ్ యూజ్ పధ్ధతిలోను , మిగిలిన 29 టాయిలెట్స్ నిర్వహణ కొరకు వివిధ ఏజెన్సీలు, స్వఛ్ఛంద సంస్ధలకు పోటీ ధర పధ్ధతిలో షార్ట్ టెండర్ పిలవడం జరుగుతుందని కమీషనర్ తెలుపగా, ఇతర సంస్ధలకు, ఏజెన్సీలకు అవకాశం ఇచ్చే కంటే ముందుగా స్ధానికంగా ఈ వృత్తిలో కొనసాగుతున్న వ్యక్తులకు అవకాశం కల్పించాలని గౌరవ సభ్యులు సూచించారు. నగరపాలక సంస్ధ స్వఛ్ఛత అందరికీ మార్గదర్శకంగా ఉండాలనే ఉద్దేసంతో, శానిటేషన్ పై పెద్ద ఎత్తున అవగాహన కల్పించే విధంగా అనేక నూతన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని కమీషనర్ తెలిపారు. స్వఛ్ఛసర్వేక్షణ్ కార్యక్రమంలో భాగంగా మెరగైన పారిశుధ్యాన్ని ప్రజలకు అందించే విధంగా కృషి చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. నగరంలో చాల చోట్ల దొంగతనాలు, హత్యలు జరుగుతున్నాయని, ఆయా జంక్షన్లలలో ఉన్న సిసి కెమెరాలు సరిగా పని చేయక, సక్రమైన వీధి దీపాలు లేక నిందితులను గుర్తించడానికి అవకాశం ఉండడం లేదని గౌరవ సభ్యులు సభ దృష్టికి తీసుకు రాగా, మూవింగ్ తో కూడిన నాణ్యమైన కమెరాలు ఆయా జంక్షన్లలో ఏర్పాటు చేయడం జరుగుతుందని కమీషనర్ సభ్యులకు తెలిపారు.  నగరవాసులకు పన్ను భారం పడకుండా చర్యలు . అజెండాలోని మొదటి అంశం చర్చలో భాగంగా ఎంపీ వంగా గీత మాట్లాడుతూ 15వ ఆర్ధిక సంఘం నిధులు మంజూరు కొరకు అర్హత సాధించుటకు నిర్దేశించి సంస్కరణలు అమలు చేయాల్సిన ఆవశ్యకత  ఉన్నప్పటికీ నగర వాసులపై పన్ను భారం పడకుండా కౌన్సిల్ సభ్యులు దృష్టి పెట్టాలన్నారు. ప్రతీ సంవత్సరం ఇంటి పన్ను భారం పడకుండా, 5 సంకత్సరాలకు ఒక సారి మాత్రమే ఇంటి పన్ను పెంచే విధంగా కౌన్సిల్ సభ్యులు ప్రభుత్వానికి సిఫార్శు చేయాలని ఆమె సూచించారు. ఈ సమావేశంలో అదనపు కమీషనర్ సిహెచ్.నాగనర్శింహారాపు, నగర పాలక సంస్ధ వివిధ అధికారులు పాల్గొన్నారు.