రక్తదాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి..


Ens Balu
2
ఉత్తర నియోజకవర్గం
2020-12-19 21:08:39

ముఖ్యమంత్రి  వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఈనెల 21న పార్టీ కార్యాలయం వద్ద నిర్వహించే రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కెకెరాజు కార్యకర్తలను కోరారు. శనివారం ఈ మేరకు విశాఖలోని తన కార్యాలయంలో రక్తదాన శిభిరానికి సంబంధించిన గోడపత్రికను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఒకరు రక్తం దానం చేయడం ద్వారా నలుగురు ప్రాణాలను కాపాడవచ్చునన్నారు. అలాంటి మంచి కార్యక్రమాన్ని మన ప్రియతమ ముఖ్యమంత్రి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసినట్టు వివరించారు. రక్తదానం చేయడం ద్వారా ఆరోగ్యం మెరుగు పడటంతోపాటు, ఆపద సమయంలో వున్నవారి ప్రాణాలను కాపాడటానికి వీలుపడుతుందన్నారు. రక్తదానం చేయడానికి స్వచ్ఛందంగా యువత ముందుకి రావాలని కెకెరాజు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గస్థాయి నాయకులు, కార్పోరేటర్ అభ్యర్ధులు నాయకులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.