పాము కనిపిస్తే కాల్ చేయండి 9849140500


Ens Balu
4
Visakhapatnam
2020-12-20 16:03:42

స్నేక్ సేవర్ సొసైటీ సేవలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని స్నేక్ సేవర్ సొసైటీ అధ్యక్షలు స్నేక్ కిరణ్ కోరుతున్నారు. ఆదివారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు.  విశాఖ నగరపరిధిలో ఎక్కడ పాములు కనిపించినా తమకు ఈనెంబరు ద్వారా 9849140500  తెలియజేస్తే తక్షణమే సదరు ప్రాంతానికి వచ్చి, రెస్క్యూ చేసి సర్పాలను, తద్వారా ప్రజలను రక్షిస్తామని చెప్పారు. విశాఖలో చాలా ప్రాంతాల్లో అరుదైన సర్పజాతులు ఉన్నాయని వాటిని మనం కాపాడుకోవాలన్నారు. పాములు కనిపించిన వెంటనే చంపకుండా తమకు తెలియజేయడం ద్వారా వాటిని పట్టుకొని సురక్షితంగా అడవులలోకి విడిచిపెడతామని వివరించారు. పాములను రక్షించడానికి, ప్రత్యేకంగా స్నేక్ సేవర్ సొసైటీ హెల్ప్ డెస్క్ ని కూడా ఏర్పాటు చేసినట్టు ఆయన వివరించారు. కనిపించిన పాములను చంపడం ద్వారా చాలా విషపూరిత కీటకాల దాడి నుంచి మనకు రక్షణ లేకుండా పోతుందని అన్నారు. చాలా కీటకాలను పాములు జనావాసాల్లోకి రాకుండా అడ్డుకుంటాయని, వాటిని తినడం ద్వారా మనము చాలా రక్షణ సర్పాల ద్వారానే పొందుతామని చెప్పారు. దానికోసం ఎప్పుడు, ఎక్కడ పాములు కనిపించా తక్షణమే సమాచారం అందించి సర్పాల పరిరక్షణలో స్నేక్ సేవర్ సొసైటీతో భాగస్వాములు కావాలని స్నేక్ సేవర్ కిరణ్ కోరారు.