అక్రిడిటేషన్ మార్పులకు మరో అవకాశం..


Ens Balu
4
Kakinada
2020-12-20 18:18:24

2021-22  సంవత్సరానికి జర్నలిస్ట్ లకు క్రొత్త అక్రిడిటేషన్ల జారీ ప్రక్రియ కొరకు గతంలో ఆన్ లైన్లో సమర్పించిన ధరఖాస్తులలో సవరణలు, పేరు మార్పులు, చేర్పులు నమోదు చేసేందకు, అప్ లోడ్ చేయని అర్హత డాక్యుమెంట్లను అప్ లోడ్ చేసేందుకు అవకాశం కల్పిస్తూ సమాచార శాఖ అక్రిడిటేషన్ల వెబ్ సైట్ http://ipr.ap.gov.in/login  జర్నలిస్ట్ లాగిన్, రిజిష్ట్రేషన్ లను మరో మారు ఓపెన్ చేయడం జరిగిందని ఆ శాఖ డిప్యూటి డైరక్టర్(ఐ/సి) ఎల్.స్వర్ణలత ఒక ప్రకటనలో తెలియజేశారు. కావున తూర్పు గోదావరి జిల్లాలోని మీడియా సంస్థలు, వాటి ప్రతినిధులు తమ సవరణలు, మార్పులు, చేర్పులు, గతంలో అప్ లోడ్ చేయని అర్హత డాక్యుమెంట్లను ఈ నెల 24వ తేదీలోపున తప్పని సరిగా నమోదు చేసుకోవాలని ఆమె తెలిజేశారు.  రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ 24వ తేదీ వరకూ అందిన ధరఖాస్తులపై పరిశీలన జరిపి జనవరి 1 తేదీ నాటికి క్రొత్త అక్రిడిటేషన్లు జారీ చేయడం జరుగుతుందన్నారు.  అక్రిడిటేషన్ జారీకి అవసరమైన కనీస అర్హతలు, సమర్పించాల్సిన డాక్యుమెంట్లు, అక్రిడిటేషన్ జిఓ నెం.142 వివరాలు వెబ్ సైట్ లాగిన్ పేజీలో అందుబాటులో ఉన్నాయని, వాటిని క్షణ్ణంగా తెలుసుకుని  అవసరమైన వ్యక్తిగత, సంస్థ సమాచారాన్ని ఆన్ లైన్ ఫారమ్ లో పొందుపరిచి, నిర్థేశిత డాక్టుమెంట్లన్నిటినీ విధిగా పిడిఎఫ్ ఫార్మాట్ లో అప్ లోడ్ చేయాల్సి ఉంటుదని తెలిపారు.  పూర్తి సమాచారం, పిడిఎఫ్ ఫార్మట్ లో అన్ని నిర్థేశిత డాక్యుమెంట్లు సమర్పించని ధరఖాస్తులను పెండింగ్ లో ఉంచడం లేదా తిరస్కరించడం జరుగుతుందని స్పష్టం చేశారు.  కావున గతంలో ఆన్ లైన్లో ధరఖాస్తు చేసిన జర్నలిస్ట్ లు అందరూ తమ లాగిన్ ద్వారా వెబ్ సైట్ లో తాము నమోదు చేసిన సమాచారాన్ని, పిడిఎఫ్ డాక్యుమెంట్లను చెక్ చేసుకోవాలని, ఇదివరకూ సమర్పించని సమాచారం,డాక్యుమెంట్లను నమోదు చేసి వాటి హార్డు కాపీలను 24వ తేదీలోపున కాకినాడలోని తమ కార్యాలయంలో సమర్పించాలని తెలియజేశారు.  అలాగే మీడియా సంస్థలు గతంలో ఇచ్చిన తమ ప్రతినిధుల జాబితాలలో  పేరు మార్పులు, చేర్పులు చేయదలిస్తే, ఎవరి స్థానంలో, ఎవరి పేర ఈ మార్పులు, చేర్పులు జరిపారో స్పష్టంగా తెలిజేస్తూ లెటర్ హెడ్ పై సవివరమైన జాబితాను ఈ నెల 24వ తేదీ లోపున అందజేయాల్సి ఉంటుందన్నారు. ఈ మార్పులు, చేర్పులు జాబితాలలో  క్రొత్తగా ప్రతిపాదించిన జర్నలిస్ట్లులు 24వ తేదీ లోపునే ఆన్ లైన్లో సమాచారం, డాక్యుమెంట్లు అప్ లోడ్ చేసి  హార్డు కాపీలు అందజేయాలని తెలిపారు.  ఏబిసి, ఆర్ఎన్ఐ సర్క్యులేషన్ లేని దినపత్రికలు చార్టెడ్ అకౌంటెంట్ సర్టిఫికేట్ తో పాటు గత 2 సంవత్సరాల జిఎస్టి రిటర్ను, న్యూస్ ప్రింట్ పర్చేజి ఫ్రూఫ్ జిఎస్టి రిటర్నులు సమర్పించాలని, కేవలం జిఎస్టి రిజిష్టేషన్ పత్రం సమర్పిస్తే చాలదని తెలిపారు.  ఎలక్ట్రానిక్ మీడియా సాటిలైట్ ఛానళ్లు ఐ అండ్ బి పర్మిషన్ పత్రం, ఐ అండ్ బి కి సమర్పించిన తాజా యాన్యువల్ రిటర్న్ కాపీలను విధిగా సమర్పించాల్సి ఉందన్నారు. అలాగే కేబుల్ టివిలు 24.12.2020 నాటికి వాలిడిటీ ఉన్న పోస్టల్ లైసెన్స్ కాపీ, సొంత రన్నింగ్ కేబుల్ లేని కేబుల్ టివిలు యంఎస్ఓతో అగ్రిమెంటు కాపీని, తమ నెట్ వర్క్ లో ప్రసారం చేస్తున్నట్లు యంఎస్ఓ జారీ  చేసిన ట్రాన్స్ మిషన్ సర్టిఫికేటు, గడచిన నెలలో ప్రసారం చేసిన న్యూస్ టెలికాస్ట్ సిడి విధిగా సమర్పించాలన్నారు.   న్యూస్ ఎజెన్సీలు ఇతర అర్హత డాక్యుమెంట్లతో పాటు సిఎ జారీ చేసిన ఇన్ కమ్ సర్టిఫికేట్, గత రెండేళ్లకు జిఎస్టి, ఇన్ కమ్ టాక్స్ రిటర్నులు తప్పని సరిగా సమర్పిచాలని తెలిపారు. ఫ్రీ లాన్స్ జర్నలిస్ట్ లు 12 తాజా బైలైన్ క్లిప్పింగులు, 10ఏళ్ల ఎక్స్ పీరియన్స్ ప్రూఫ్ లను, వెటరన్, రిటైర్డు జర్నలిస్టులు డేటా ఆఫ్ బర్త్ ప్రూవ్, 20 ఏళ్ల ఎక్స్ పీరియన్స్ ప్రూఫ్ లను సమర్పించవలసి ఉందని డిప్యూటీ డైరక్టరు స్వర్ణలత తెలియజేశారు. జిల్లాలోని మీడియా సంస్థలు, జర్నలిస్ట్ లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.