ఫెడరేషన్ గౌరవ అధ్యక్షులుగా కెకెరాజు..


Ens Balu
2
Visakhapatnam
2020-12-20 18:51:01

ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డ్  సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ విశాఖ జిల్లా అధ్యక్షులుగా విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కెకె రాజు నియమితులయ్యారు. ఈ మేరకు ఆదివారం డాబాగార్డెన్స్ లో  జరిగిన సమావేశంలో ఆయనను ఆంధ్రప్రదేశ్ గ్రామ , వార్డ్ సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ విశాఖ జిల్లా గౌరవ అధ్యక్షులుగా నియమించారు. ఈ సందర్భంగా  కె కె రాజు మాట్లాడుతూ, గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం మన ముఖ్యమంత్రి  వైయస్ జగన్మోహన్ రెడ్డి  ద్వారా నెరవేరిందని అన్నారు. భారతదేశంలో ప్రజల ఇంటిముంగటే సేవలు చేసే ఒక మహత్తరమైన వ్యవస్థను సీఎం వైఎస్ జగన్ ఏర్పాటు చేశారన్నారు. ఇలాంటి గ్రామ ,వార్డ్  సచివాలయం ఉద్యోగుల ఫెడరేషన్ కు తనను గౌరవ అధ్యక్షులు గా  నియమించినందుకు ధన్యవాదాలు తెలిపారు. శక్తివంచన లేకుండా  ఉద్యోగుల భవిష్యత్ కు మేలు జరిగేలా కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ  రాష్ట్ర ట్రేడ్ యూనియన్  అధ్యక్షులు గౌతమ్ రెడ్డి , దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్,తదితరులు పాల్గొన్నారు.