రాజధాని తరలింపు తర్వాతే జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలు..


Ens Balu
1
Visakhapatnam
2020-12-20 19:23:16

రాష్ట్రకార్యవిర్వాహక రాజధానిని విశాఖపట్నంకు  తరలించిన మీదట అక్రిడేటెడ్‌ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని రాజ్యసభసభ్యుడు, వైఎస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి జర్నలిస్టుల ప్రతినిధి బృందానికి స్పష్టం చేశారు. విశాఖ నగరంలోని సర్క్యూట్‌ హౌస్‌లో ఆదివారం లోకల్‌ న్యూస్‌ పేపర్స్‌ అసోషియేయన్‌( ఎల్‌ఎన్‌ఏ) ప్రతినిధి బృందం ఆయనను కలిసి జర్నలిస్టులకు డిసెంబర్‌ 25నాటికి బిపిఎల్‌ వారితో పాటు 200 చదరపు గజాల చొప్పున ఇళ్లస్థలాలు ఇవ్వాలని వినతి పత్రాన్ని అందజేశారు. వైఎస్‌జగన్‌ ప్రజాసంకల్ప యాత్ర సమయంలోనూ, ఎన్నికల మ్యానిఫెస్టోలోనూ ఇళ్లస్థలాల హామీ ఇచ్చారని గుర్తు చేశారు. దీనిపై స్పందించిన విజయసాయిరెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి జర్నలిస్టులకు, ఎంఎల్‌ఏలకు ఇళ్లస్థలాలు ఇవ్వటానికి సిద్ధంగానే ఉన్నారని డిసెంబర్‌ 25నాటికి సాధ్యం కాదని తెలిపారు. రాజధాని తరలింపు తరువాతే ఇళ్లస్థలాలు ఇస్తారన్నారు. అంతకంటే ముందు జర్నలిస్టులు అక్రిడిటేషన్లు పొందాలని, వాటిలో ఉత్తీర్ణత సాధించాలని సూచించారు. ఆయనను కలిసిన జర్నలిస్టుబృందంలో ఎల్‌ఎన్‌ఏ అధ్యక్షకార్యదర్శులు పి.సత్యనారాయణ,దవిళేశ్వరపు రవికుమార్‌, సీనియర్‌ జర్నలిస్టులు  నిట్టల శ్రీనివాస్‌, బి.శివప్రసాద్‌, ఎస్‌.సన్యాసిరావు, ప్రతినిధులు పట్టెపు నాగేశ్వరరావు, బి.నారాయణరావు, పరశురామ్‌, ఎం.శ్రీహరి, రామ్‌మోహన్‌ రావు, చక్రి,తదితరులు పాల్గొన్నారు.