టీడీపీ నేతల భూ ఆక్రమణల తొలగింపు..


Ens Balu
3
ఆనందపురం
2020-12-20 19:48:23

విశాఖలోని తెలుగుదేశం పార్టీకి చెందిన నేతల భూ ఆక్రమణలను ప్రభుత్వం ఆదివారం ఉదయం స్వాధీనం చేసుకుంది. అందులో విశాఖ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే  వెలగపూడి రామకృష్ణ ప్రసాద్ ఆక్రమించిన రుషికొండ సమీపంలోని గెడ్డ  ప్రాంతం విలువైన భూమిని ఇవాళ తెల్లవారు జామున రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే, టిడిపి నేత పీలా గోవింద్ ఆక్రమణలో ఉన్న ఆనందపురం మండలంలో దాదాపు 300 ఎకరాలను కూడా రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.  దీని విలువ సుమారు 300 కోట్ల రూపాయలు పైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. అధికారంలో ఉన్న సమయంలో భూ ఆక్రమణలంటే ఒంటికాలిపై లేచిన టిడిపి నేతల ఆక్రమణల విషయంలో ప్రభుత్వం దూకుడు పెంచడంతో భూ ఆక్రమణలు వెలుగు చేస్తున్నాయి. అంతేకాకుండా జిల్లా వ్యాప్తంగా వీరి చెరలో వున్న భూములను ప్రభుత్వం వెతికి వెతికి పసిగడుతోంది. దీంతో చాలా మంది టిడిపి నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ప్రభుత్వ రికార్డుల ఆధారంగా రెవిన్యూ అధికారులు ఆక్రమిత భూములు స్వాధీనం చేసుకోవడం జిల్లాలో చర్చనీయాంశం అవుతోంది..