సంక్షేమానికి నిలువెత్తు రూపం ఏపీ సీఎం..
Ens Balu
3
ఆంధ్రాయూనివర్శిటీ
2020-12-21 21:08:28
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు హెల్త్‌కార్డులు అందించే దిశగా చర్యలు ప్రారంభమయ్యాయని, దీనికి సంబంధించిన ఉత్తర్వులు సైతం తమకు చేరాయని ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి అన్నారు. సోమవారం ఉదయం ఏయూ సెనేట్ మందిరంలో నిర్వహించిన ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన రెడ్డి జన్మదిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశ్వవిద్యాలయ ఉద్యోగుల చిరకాల వాంఛ హెల్త్‌కార్డులు మంజూరుతో ఉద్యోగులకు పూర్తిస్థాయిలో ఆరోగ్య భరోసా లభిస్తుందన్నారు. ఉన్నత విద్యలో ప్రవేశించే వారి శాతం పెంపొందించడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఈ దిశగా పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయం వరకు జగనన్న అమ్మఒడి, ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీనెన పథకాలను అందిస్తున్నారన్నారు. పేదల అభివృద్దితోనే నిజమైన ప్రగతి సాధ్యపడుతుందని ముఖ్యమంత్రి విశ్వశిస్తున్నారన్నారు.
సంక్షేమానిక నిలువెత్తు సంతకంగా వై.ఎస్ జగన్ మోహన రెడ్డి నిలుస్తారన్నారు. ఇప్పటికే వందకుపైగా సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి విజయవంతంగా నిర్వహిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో ప్రజల విద్య, వైద్యానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో బాధ్యతను స్వీకరించిందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుంటూ ప్రతీ విద్యార్థి తల్లిదండ్రులు మెచ్చే బిడ్డలుగా ఎదగాల్సిన అవసరం ఉందన్నారు. వర్సిటీకి విద్యార్థులే ప్రధానమని, వారికి ఉపయుక్తంగా ప్రతీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు.