నిరుపేదల ఆశాజ్యోతి సీఎం జగన్..


Ens Balu
1
Visakhapatnam
2020-12-21 21:14:23

నిరుపేదల ఆశాజ్యోతి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి అని వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి అన్నారు. సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు సందర్భంగా 21 వార్డ్ లో చినవాల్తేర్ చిన్న హాస్పిటల్ వద్ద వైఎస్సార్సీపీ నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్  ఆధ్వర్యంలో కేక్ కటింగ్ , చీరలు పంపిణి జరిగింది. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు, వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి  వి.విజయసాయిరెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ  దేశ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి అద్భుతమైన పరిపాలన చేసి, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని అన్నారు. కార్యక్రమంలో 1000 మంది నిరుపేదలకు చీరలు పంపిణీ చేశారు. ఎంపీ ఎమ్.వి.వి. సత్యనారాయణ నిర్వహకులు శరన్ కుమార్ రెడ్డి, ప్రేమ్ కుమార్,మదుపాడ రవి, పాల్గొన్నారు.