గురుకులాల్లో 5వ తరగతి సీట్లు భర్తీ..
Ens Balu
2
Srikakulam
2020-12-21 22:06:41
శ్రీకాకుళం జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతి సీట్లను భర్తీ చేయడం జరిగిందని సాంఘీక సంక్షేమ గురుకులాల జిల్లా కోఆర్డినేటర్ వై. యశోద లక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట్ర సాంఘీక సం క్షేమ గురుకుల విద్యాలయ సంస్థ కార్యదర్శి ఆదేశాల మేరకు 2020-21 వ విద్యా సంవత్సరం లో 5వ తరగతి ప్రవేశానికి ఆన్లైన్ ద్వారా లాటరీ పద్ధతిని సాంఘీక సంక్షేమ గురుకులాల జిల్లా కోఆర్డినేటర్ కార్యాలయంలో సోమ వారం ఉదయం 11 గంటల నుంచి నిర్వహించామన్నారు. జిల్లాలో 11 గురుకులాలు ఉండగా అందులో 880 సీట్లు ఉండగా 770 సీట్లు భర్తీ చేయడం జరిగిందన్నారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్ (బి.ఏ.ఎస్) లకు గాను మిగిలిన సీట్లను ఉంచడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ ఆన్ లైన్ లాటరీ ప్రక్రియ సాంఘీక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ పి.వెంకటరత్నం, జిల్లాలో గల సాంఘీక సంక్షేమ గురుకులాల ప్రధానోపాధ్యాయులు, వివిధ పాఠశాలల పేరెంట్స్ కమిటీ చైర్మెన్లు, సెక్రెటిరీలు, జిల్లా విజిలెన్సు మోనిటరింగ్ కమిటీ సభ్యులు కంట వేణు సమక్షంలో జరిగిందని ఆమె పేర్కొన్నారు. పాఠశాలల వారిగా సీట్లు కేటాయింపు పత్రాలను జిల్లా కోఆర్డినేటర్ కార్యాలయంలోనూ, ప్రతి పాఠశాల నోటీసు బోర్డుపైన పొందుపరిచామని ఆమె చెప్పారు. సీట్ ఖరారు అయిన విద్యార్థిని, విద్యార్థులు వారి ఒరిజినల్ సర్టిఫికేట్లతో ఆయా పాఠశాలలకు హాజరు అయి ఈ నెల 28వ తేదీ లోగా సీటును ఖరారు చేసుకోవాలని ఆమె స్పష్టం చేసారు. ఫలితాల కొరకు అభ్యర్ధి ఆధార్ నెంబర్ తో http://apgpcet.apcfss.in/ వెబ్ సైట్ ను సంప్రదించవచ్చని యశోద లక్ష్మి తెలిపారు.