మంగళవారం జిల్లా మంత్రి పర్యటన..
Ens Balu
4
Vizianagaram
2020-12-21 22:15:20
రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి బొత్స సత్యనారాయణ ఈనెల 22న జిల్లాకు వస్తున్నట్టు జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ తెలిపారు. ఈనెల 22 నుండి 25వరకు మంత్రి జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొంటారని వెల్లడించారు. మంత్రి బొత్స సత్యనారాయణ 22న మధ్యాహ్నం 1-00 గంటలకు విశాఖ చేరుకొని అక్కడి నుండి రాత్రి 7.30 గంటలకు విజయనగరం చేరుకుంటారని తెలిపారు. 23న ఉదయం 9-00 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా పర్యటన ఏర్పాట్లను పరిశీలించే నిమిత్తం గుంకలాంలో సభాస్థలిని పరిశీలించి కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో సి.ఎం. పర్యటన ఏర్పాట్లపై సమీక్షిస్తారని పేర్కొన్నారు. ఉదయం 11-00 గంటలకు గజపతినగరంలో ఒక ప్రైవేటు కార్యక్రమానికి హాజరవుతారని, 11-30 గంటలకు గజపతినగరంలో నిర్మించనున్న వంద పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేస్తారని పేర్కొన్నారు.మధ్యాహ్నం 3-00 గంటలకు బొండపల్లి మండలం తమటాడలో వై.ఎస్.ఆర్. జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్ష ప్రాజెక్టును ప్రారంభిస్తారని పేర్కొన్నారు.
24న ఉదయం 11 గంటలకు సాలూరు చేరుకొని అక్కడ నిర్మించనున్న 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేస్తారని తెలిపారు. సాయంత్రం లీ పారడైజ్ ఫంక్షన్ హాలులో జరిగే ప్రైవేటు కార్యక్రమానికి హాజరవుతారు.
25న ఉదయం 11 గంటలకు చీపురుపల్లిలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. 12 గంటలకు కెజిబివి స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.