విజయనగరం స్పందన కు 205 దరఖాస్తులు..


Ens Balu
1
Vizianagaram
2020-12-21 22:17:10

సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన స్పందన కు 205 వినతులు అందాయి.  ముఖ్యంగా ఇళ్ళ స్థలాలు, పించన్ల,  ఆరోగ్య శ్రీ , ఆదరణ,  రైతు భరోసా, అమ్మ ఒడి లబ్ది కోసం దరఖాస్తులు అందాయి.  జిల్లా కలెక్టర్ డా. హరి జవహర్లాల్ , సంయుక్త కలెక్టర్లు డా. జి.సి.కిషోర్ కుమార్, డా. మహేష్ కుమార్ రవిరాల,  జే. వెంకట రావు,  విపత్తుల శాఖ ప్రోజెక్ట్ అధికారి పద్మావతి   వినతులను అందుకున్నారు.  స్పందనలో అందిన  వినతులను  వెంటనే పరిష్కారం అయ్యేలా చూడాలని అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. స్పందన అనంతరం పౌర సరఫరాల వాహనాల లబ్ది దారులు,  ఇళ్ళ పట్టాలు, జగనన్న తోడు, కన్వర్జెన్స్ పనులు, నాడు- నేడు , బల్క్ మిల్క్ కూలింగ్ కేంద్రాలు, ధాన్యం సేకరణ,  మనం- మన పరిశుభ్రత,  ఓటర్ల  నమోదు  తదితర కార్యక్రమాల పై సమీక్షించారు.       జనవరి 1 నుండి పౌర సరఫరాల  ద్వార రేషన్ సరుకులను పంపిణీ చేయుటకు అవసరమగు వాహనాల కోసం దరఖాస్తు చేసుకున్నలబ్దిదారుల వివరాలను వెంటనే పంపించాలని కలెక్టర్ ఆదేశించారు. ఎస్.సి. ఎస్.టి, బి.సి, మైనారిటీ వర్గాలకు చెందిన లబ్ది దారులను ఎంపిక చేసి  జిల్లా ఇంచార్జ్ మంత్రి ఆమోదానికి పంపాలని అన్నారు.  జనవరి 1నాటికీ 18 ఏళ్ళు నిండిన వారిని  ఓటర్లుగా  చేర్పించాలని, క్లెయిమ్స్, అభ్యంతరాలను కూడా పరిష్కరించాలని జిల్లా రెవిన్యూ అధికారికి సూచించారు.  ఈ నెల 30 న రాష్ట్ర ముఖ్య మంత్రి జిల్లా పర్యటన  విజయవంతం చేయాలని అధికారులకు సూచించారు.  ఎవరికీ వేసిన డ్యూటీ లను వారు ఎలాంటి లోపాలు లేకుండా జాగ్రత్త గాచేయాలని అన్నారు. కన్వర్జెన్స్ పనులు  వేగవంతం కావాలి :       ఉపాధి హామీ నిధులతో చేపడుతున్న  కన్వర్జెన్స్  పనులను సత్వరమే ప్రారంభం కావాలని జిల్లా కలెక్టర్ అధికారులకు ఆదేశించారు.   రైతు భరోసా కేంద్రాలు, వెల్నెస్ కేంద్రాలు,  అంగన్వాడి కేంద్రాలు , సచివాలయాల  నిర్మాణాలకు ప్రారంభం కాని  పనులు వెంటనే ప్రారంభం చెయ్యాలన్నారు. ఈ పనులకు అవసరమగు భూమి వెంటనే హ్యాండ్ ఓవర్ కావాలన్నారు.  వై.ఎస్.ఆర్ బీమా,  జగనన్న తోడు  పధకాలలో పురోగతి కనపడాలన్నారు.  ఇ – సేవలు   పెండింగ్ పై సమీక్షిస్తూ పౌర సరఫరాలు, జిల్లా రెవిన్యూ అధికారి, మున్సిపల్, పంచాయతి రాజ్, జిల్లా పరిషత్, పంచాయతి అధికారి  వద్ద ఎక్కువగా ఊనయని, వాటిని  ఈ రోజే క్లియర్ అయ్యేలా చూడాలని సూచించారు. స్పందన భోజనం కొనసాగింపు:        స్పందన అర్జీ దారులకు ఉచితంగానూ,  10/- రూపాయలకు పెట్టె భోజనం ఉద్యోగులు సహకరిస్తే వచ్చే ఏడాది కూడా కొనసాగించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.  బయట వ్యక్తులు అనేక మంది ఆర్ధిక సహాయం చేస్తామని అడుగుతున్నారని,  అయితే వారికీ అవకాసం ఇవ్వడం లేదని, ఉద్యోగులు స్వచ్చందంగా ముందుకు వస్తే కొనసాగిస్తామని అన్నారు.   ఉద్యోగుల కుటుంభ  సభ్యుల ఉత్సవాల గుర్తుగా పుట్టిన రోజులకు, రిటైర్మెంట్లకు, వివాహ మహోత్సవాలకు,  మరణించిన వారి  జ్ఞాపకార్ధంగా, లేదా ఇతర పండగల సందర్భంగా  ఉద్యోగులు స్వచ్చందంగా స్పాన్సర్ చేయడానికి ముందుకు రావాలని కలెక్టర్ పిలుపు నివ్వగా వెంటనే అధికారులు వారానికి ఒకరం చొప్పున  సమకూర్చడానికి ముందుకు వచ్చారు.  జనవరిలో వచ్చే మొదటి సోమవారం సంయుక్త కలెక్టర్ (ఆసరా) వెంకట రావు  ప్రకటించగా వెంటనే సంయుక్త కలెక్టర్ కిషోర్ కుమార్,  పద్మావతి, డి.ఈ.ఓ  తదితరులు మిగిలిన వారాల కోసం  ముందుకు వచ్చారు.  ఇది మంచి కార్యక్రమమని, వికలాంగులకు, గర్భిణీలకు, వృద్ధులకు భోజనం పెట్టడం అదృష్టంగా భావించాలని కలెక్టర్ అన్నారు. మంగళ వారం కార్యాలయాల పరిశుభ్రత : మనం- మన పరిశుభ్రత  కార్యక్రమం లో భాగంగా మంగళ వరం ఉదయం 7 గంటలకు కల్లెక్టరేట్ తో పాటు కార్యాలయాలన్నిటిని  పరిశుభ్రం చేయాలనీ కలెక్టర్ ఆదేశించారు. కార్యాలయాలు, ఆవరణలు పరిశుభ్రంగా ఉండక పోతే  సంబంధిత అధ్దికారి పై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆ మేరకు అధికారులందరికీ సర్కులర్ జారి చేసారు. ఈ కార్యక్రమం లో  అధికారులు, సిబ్బంది అందరు పాల్గొనాలని  అన్నారు.  కల్లెక్టరేట్ లో పై అంతస్తు లో నున్న కార్యాలయాల నుండి కిందకు చెత్త వేయకూడదని, అలాగే ఎక్కడ బడితే అక్కడ ఉమ్మి వేయకూడదని సూచించారు. కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేస్తానని, ఎక్కడైనా   చెత్త  వేసినట్లయితే ఆ కార్యాలయ సిబ్బంది తో మొత్తం కల్లెక్టరేట్ ను శుభ్రం చేయించడమే శిక్షగా వేస్తానని హెచ్చరించారు.  సచివాలయాలు కూడా సేవలు సంతృప్తిగా ఉంటున్నాయి కాని, పరిశుభ్రత, పచ్చదనం అంతగా పట్టించుకోవడం లేదని, సచివాలయాల ఉద్యోగులు కూడా దీని పై శ్రద్ధ పెట్టేలా  చూడాలని అన్నారు.